Breaking News

జ్యోతిష్యం ఫలిస్తుంది!

Published on Sat, 10/26/2024 - 11:09

సాక్షి, చెన్నై: జ్యోతిష్యం ఫలిస్తుందని, 2026లో రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సేలంలో జరిగిన పార్టీ నేతల సమావేశానంతరం పళణిస్వామి మీడియాతో మాట్లాడారు. డీఎంకే కూటమిలో పొగచిచ్చుగా మారడం ఖాయం అన్నారు. 41 నెలల డీఎంకే పాలనలో నోరెత్తని కూటమి పారీ్టల నేతలు ఇప్పడు విమర్శలు గుప్పించడాన్ని ప్రతిఒక్కరూ పరిగణించాలన్నారు. 

ఈ పరిణామం చీలిక కాదా అని ప్రశ్నించారు. పళని స్వామి జ్యోతిష్కుడు అయ్యాడని సీఎం వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. వాస్తవమే జ్యోతిష్యం ఫలిస్తుందని 2026లో రాష్ట్రంలో అధికారం అన్నాడీఎంకే గుప్పెట్లోకే అని ధీమా వ్యక్తంచేశారు. దేశంలోనే తమిళనాడు అవినీతిలో ముందంజలో ఉందని ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేలో యువత రావాలని, యువతను ఆకర్షించే కార్యక్రమాలు విస్తృతంచేయనున్నట్టు పేర్కొన్నారు.  

పళణికి నోటీసులు.. 
పళణిస్వామికి మద్రాసు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో గతంలో సినీ నిర్మాత జాఫర్‌ సాధిక్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని డీఎంకేపై పళణిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరుకు కళంగం తెచ్చే విధంగా వ్యవహరించారని ఆయనపై డీఎంకే సీనియర్‌ నేత ఆర్‌ఎస్‌ భారతీ రూ.కోటి పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి టికారాం విచారించారు. వాదనల అనంతరం వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పళణిస్వామికి నోటీసులు జారీ చేశారు.  

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)