Breaking News

ఆధార్‌ కార్డులపై అస్సాం కీలక నిర్ణయం

Published on Sun, 06/14/2026 - 11:59

దిస్పూర్‌: అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసలను అరికట్టడానికి ఇక నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి ఆధార్‌ కార్డుల జారీ నిలిపివేసినట్లు పేర్కొంది. అయితే ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులకు మాత్రం 2027 వరకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది

అస్సాంలో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసలు ఎంత అరికట్టినా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ 100% మించిపోయింది. కొన్ని చోట్ల ఆ పర్సంటైజ్  115% వరకు ఉంది. అంటే అక్రమంగా వలస వచ్చిన వారికి సైతం ఆధార్ కార్డు లభించింది.  ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  

రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి ఇకపై సాధారణ పద్ధతిలో ఆధార్ కార్డుల జారీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా ఆధార్ కార్డు పొందాలంటే కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఈ నిబంధనల నుండి దివ్యాంగులు ఎస్సీ, ఎస్టీ, కాఫీ తోటల కార్మికులకు మార్చి31, 2027 వరకు ఈ నిషేధం నుండి మినహాయింపు  ఇస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో 18 ఏళ్లలోపు పిల్లలు, యువతకు సాధారణ పద్ధతిలో ఆధార్‌ కార్డు జారీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది.

కాగా అస్సాంలో ఎన్నో ఏళ్లు తరబడిగా అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. అస్సాం రాష్ట్రం బంగ్లాదేశ్‌తో దాదాపు 267.5 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది.  దానిలో చాలా వరకూ చాలా వరకు కంచె  వేసినప్పటికీ, నదులు, అడవులు మరియు కొండ ప్రాంతాల కారణంగా కొన్ని చోట్ల సరిహద్దులు ఇప్పటికీ పూర్తిగా మూసివేయబడలేదు.

ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని అక్రమ వలసదారులు భారతదేశంలోకి చొరబడుతున్నారు. అక్రమ వలసల వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గడంతో పాటు అస్సాం యొక్క ప్రత్యేకమైన భాష, సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతాయనే భయం స్థానికులలో ఉంది. దీంతో వలసలను నిరోధించేలా అస్సాం ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)