జైరాం రమేష్ వ్యాఖ్యలపై అస్సాం సీఎం కామెంట్స్

Published on Mon, 03/25/2024 - 08:50

ఇండియా కూటమి చెక్కు చెదరలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి 'జైరామ్‌ రమేశ్‌' ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని, ఇండియా కూటమి  272కి పైగా సీట్లు సాధిస్తాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలపైన అస్సాం ముఖ్యమంత్రి 'హిమంత బిస్వా శర్మ' కామెంట్ చేశారు.

బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమికి దూరంగా ఉన్నాయి. అయినా కూటమి చెక్కు చెదరలేదని చెబుతున్నారు. ఇండియా కూటమి కలిసి ఉండటం బహుశా భూమిపైన కాదు. చంద్రుడు, సూర్యుడిలో ఉందని అన్నారు. అవి మన సాధారణ దృష్టికి కనిపించవని ఎద్దేవా చేశారు.

దేశ ప్రజల విశ్వాసం, స్పష్టమైన గుర్తింపుతో పోరాడతామని హిమంత బిస్వా అన్నారు. అస్సామీ ప్రజలు తప్పకుండా విజయం చేకూర్చుతారని పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం 14 లోక్‌సభ నియోజకవర్గాలను కలిగి ఉంది. ఈసారి లోక్‌సభ ఎన్నికలు మూడు దశల్లో.. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీలలో పోలింగ్ జరుగుతుంది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో అస్సాంలోని 14 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 7 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) రెండూ ఒక్కొక్కటి మూడు స్థానాలను సొంతం చేసుకున్నాయి. 2019 ఎన్నికల సమయంలో, BJP తన సీట్ల సంఖ్యను 9కి పెంచుకుంది. కాంగ్రెస్ తన మూడు స్థానాలను కొనసాగించింది మరియు AIUDF ఒక్క సీటును గెలుచుకుంది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)