మాతృత్వానికి తగిన వయస్సు ఉండాల్సిందే!: అసోం సీఎం

Published on Sat, 01/28/2023 - 15:24

గువాహతి: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాల్య వివాహాల కట్టడికి తమ రాష్ట్రంలో కఠిన చట్టం తేబోతున్నట్లు ప్రకటించిన ఆయన.. మాతృత్వానికి తగిన వయసు ఉండాల్సిందేనని, లేకుంటే సమస్యలు తప్పవని మహిళలకు సూచించారు. అసోంలో ప్రతీ వందలో 31 పెళ్లిళ్లు.. నిషేధించిన వయసు వాళ్ల వివాహాలే కావడం గమనార్హం. ఈ తరుణంలో..

శనివారం ప్రభుత్వం తరపున నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, చిన్నవయసులోనే మాతృత్వంలాంటి అంశాల కట్టడికి కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైందని ప్రకటించారాయన. మాతృత్వానికి తగిన వయసు ఉండాల్సిందేనన్న ఆయన.. లేకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవని మహిళలకు సూచించారు. ‘‘మహిళలు మాతృత్వం కోసం మరీ ఎక్కువ కాలం ఎదురు చూడడం సరికాదు. దానివల్ల సమస్యలు వస్తాయి. మాతృత్వానికి తగిన వయసు 22 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపే’’ అని తెలిపారాయన. ఇంకా పెళ్లికాని వారుంటే ఇది తప్పక పాటించండి అని చిరునవ్వుతో సూచించారు. ఇక బాల్యవివాహాల కట్టడికి తీసుకోబోయే చర్యల గురించి స్పందిస్తూ.. 

‘‘రాబోయే ఐదారు నెలల్లో.. వేల మంది పురుషులు కటకటాల పాలు కాకతప్పదు. ఎందుకంటే పద్నాలుగేళ్లలోపు బాలికలతో శారీరకంగా కలవడం నేరం కాబట్టి. వాళ్లు తాము భర్తలమని నిరూపించుకున్నా సరే!. చట్ట ప్రకారం.. వివాహ వయసు 18 ఏళ్లు. కాదని అంతకన్నా తక్కువ వయసులో ఉన్నవాళ్లను వివాహాలు చేసుకుంటే జీవిత ఖైదు తప్పదు అని అసోం సీఎం హెచ్చరించారు. చిన్నవయసులో మాతృత్వం కట్టడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ, అదే సమయంలో మహిళలు తల్లి కావడానికి ఎక్కువ ఏండ్లు తీసుకోవద్దు. ఎందుకంటే.. దేవుడు మన శరీరాలను తగిన వయసులో తగిన పనుల కోసమే సృష్టించాడు కాబట్టి అని సీఎం బిస్వా శర్మ పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. పద్నాలుగేళ్లలోపు బాలికలను వివాహం చేసుకుంటే గనుక.. పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేయాలని అసోం కేబినెట్‌ సోమవారం ఓ నిర్ణయం తీసుకుంది. అలాగే.. 14 నుంచి 18 ఏళ్లలోపు వాళ్లను వివాహం గనుక చేసుకుంటే బాల్యవివాహ నిర్మూలన చట్టం 2006 ప్రకారం కేసు నమోదు చేస్తారు.     

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)