YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల
Breaking News
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
రోడ్ రోలర్ నడిపిన సీఎం హిమంత
Published on Mon, 07/13/2026 - 05:35
గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రోడ్డు రోలర్ నడిపారు. అదేదో నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం కాదు. మాదక ద్రవ్యాల విధ్వంసం కోసం. రాష్ట్రంలోనే అతిపెద్ద మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా రాష్ట్రం రూ. 472.51 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాదీనం చేసుకుంది.
వాటిని ధ్వంసం చేసే కార్యక్రమం గువాహటి శివార్లలో మంత్రులు, అస్సాం సీనియర్ పోలీసు అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారుల సమక్షంలో జరిగింది. ఇందులో భాగంగా మంత్రి హిమంత రోడ్ రోలర్ను నడిపి మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. మాదకద్రవ్యాలపై తమ పోరాటం నిరంతరాయంగా సాగుతుందని చెబుతూ ఆ వీడియోను తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
#
Tags : 1