Breaking News

సందర్శనలకు తులిప్‌ గార్డెన్‌ సిద్ధం 

Published on Tue, 02/17/2026 - 04:30

జమ్మూ: ఆసియాలోనే అతిపెద్దదైన సుందర తులిక్‌ పుష్పాల తోట సహా 14 పర్యాటక ప్రాంతాలు సందర్శనలకు సిద్ధమయ్యాయి. శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌ సహా తమ కేంద్రపాలిత ప్రాంతంలోని 14 టూరిస్ట్‌ స్పాట్‌లలోకి పర్యాటకులను అనుమతిస్తామని జమ్మూకశీ్మర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సోమవారం ప్రకటించారు. హిమాలయ పర్వత సానువుల్లో యూస్‌మార్గ్‌ పచి్చకబయళ్ల వెంట విస్తరించిన ఆల్పైన్‌ చెట్ల సౌందర్యాన్ని ఇప్పుడు సందర్శకులు ఆస్వాదించవచ్చు. 

గత ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్‌లోని బైసారన్‌ పచి్చకబయళ్లలో ఉగ్రవాదుల పాశవిక దాడి తర్వాత పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకుల రాకపై నిషేధం అమల్లోకి వచి్చంది. దీంతో జమ్మూకశీ్మర్‌ పరిధిలోని దాదాపు 50 టూరిస్ట్‌ స్పాట్‌లలో పర్యాటకరంగం కుదేలైంది. తాజాగా భద్రతా సమీక్షలు, తాజా పరిస్థితిని సమీక్షించాక మళ్లీ సందర్శకులను అనుమతించాలని నిర్ణయించామని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం సోమవారం తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స’ఖాతాలో ఒక పోస్ట్‌ పెట్టింది. 

యూస్‌మార్గ్, దూ«ద్‌పత్రి, దండిపొర పార్క్, పీర్‌ కీ గలీ, దూబ్‌జాన్, పాద్‌పవన్, ఆస్తాన్‌పొర, థాజ్వాస్‌ గ్లేసియర్, హుంగ్‌ పార్క్, వులార్, వత్లాబ్, తులిప్‌ గార్డెన్‌లలోకి వెంటనే సందర్శనలకు అనుమతిస్తున్నామని సిన్హా వెల్లడించారు. జబర్వాన్‌ హిల్స్‌ సమీప మైదానంలో చక్కటి వరసల్లో రంగురంగుల లక్షలాది తులిప్‌ పువ్వులతో సిద్ధమైన ‘ఇందిరా గాంధీ మెమోరియల్‌ తులిప్‌ గార్డెన్‌’కు ఈసారి భారీగా పర్యాటకులు పోటెత్తవచ్చని అధికారులు ఆశిస్తున్నారు. ఖత్రా, శ్రీనగర్‌ మధ్య వందే భారత్‌ రైలు అందుబాటులోకి రావడంతో పర్యాటకులు వేగంగా ఆయా పర్యాటక ప్రాంతాలకు చేరుకునే అవకాశం లభించింది.  

#

Tags : 1

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు