Breaking News

కేజ్రీకి ఈ ఆలయం ఒక సెంటిమెంట్‌?

Published on Sat, 05/11/2024 - 12:08

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు జూన్ ఒకటి వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ లోపు ప్రచారం కూడా చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయనకు ఈ ఆలయం అంటే చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సంకటమోచన హనుమాన్‌ ఆలయ దర్శన సమయంలో, అతని భార్య, ఇతర నేతల ఆయన వెంట ఉండనున్నారు.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి కేజ్రీవాల్‌ పలు సందర్భాల్లో ఈ ఆలయానికి వెళుతుంటారు. ఈ ఆలయంలో వెలసిన హనుమంతునిపై ఆయనకు ఎంతో నమ్మకం ఉంది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2013లో తొలిసారిగా ఆయన ఈ హనుమాన్ ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం ఏర్పడి 49 రోజులు సీఎంగా కొనసాగారు. దీని తర్వాత 2015లో ఢిల్లీలో రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు కేజ్రీవాల్ మళ్లీ సీఎం అయ్యాక మరోసారి ఈ ఆలయాన్ని సందర్శించారు.

2020లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, అంతకు ముందు కూడా సీఎం కేజ్రీవాల్ ఈ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన ఈ ఆలయానికి వెళ్లారు. నాడు ఆయన పార్టీ మరోసారి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చిలో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన  జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఈ ఆలయానికి  వచ్చి పూజలు  నిర్వహించారు. ఆ సమయంలో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)