పూజారులు, గ్రంథీలకు నెలకు రూ.18 వేలు

Published on Tue, 12/31/2024 - 04:48

సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్‌ ఆద్మీ పార్టీ మరో వరాల జల్లు కురిపించింది. ఆలయాల్లో పూజారులు, గురుద్వారాల్లో సేవచేసే గ్రంథీలకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆప్‌ జాతీయ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లోని ప్రాచీన హనుమాన్‌ ఆలయం నుంచి ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను స్వయంగా కేజ్రీవాల్‌ ప్రారంభించనున్నారు. ముందుగా హనుమాన్‌ ఆలయం అర్చకుల పేర్లను నమోదు చేస్తారు. 

ఆ తర్వాత.. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఢిల్లీలోని అన్ని దేవాలయాలు, గురుద్వారాలకు వెళ్లి పూజారులు, గ్రంథిల పేర్లు నమోదు చేస్తారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్‌ ఈ వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మహిళా సమ్మాన్, సంజీవని యోజన లాగా ‘పూజారి, గ్రం«థి సమ్మన్‌ యోజన’కు ఎలాంటి అవాంతరాలు కలిగించవద్దని బీజేపీని వేడుకుంటున్నా. అయినాసరే అడ్డుకుంటామంటే బీజేపీకి మహాపాపం చుట్టుకుంటుంది.

 పూజారులు, గ్రంథులు మనకు దేవుడికి మధ్య వారధులుగా ఉంటూ మన ఆచారాలను భవిష్యత్‌ తారాలకు అందజేస్తున్నారు. సమాజంలో పూజారులు, గ్రంథీలు కీలక పాత్ర పోషిస్తున్నా వారు ఇన్నాళ్లూ నిర్లక్షానికి గురయ్యారు. దేశంలోనే తొలిసారిగా వీళ్లను ఆదుకునేందుకు ఈ పథకం తెస్తున్నాం. ఢిల్లీ రాష్ట్రంలో ఆప్‌ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పథకం అమల్లోకి వస్తుంది. గతంలో ఏ పార్టీ, ప్రభుత్వం ఇలాంటి ప్రయోజనం అర్చకులకు, సేవకులకు చేకూర్చలేదు. 

బీజేపీ, కాంగ్రెస్‌ పారీ్టలు కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని అర్చకుల కోసం ఇలాంటి పథకాన్ని ప్రారంభిస్తాయని ఆశిస్తున్నా’’అని కేజ్రీవాల్‌ అన్నారు. ‘‘దేశ సంస్కృతి, సంప్రదాయాలను తరాలుగా కొనసాగిస్తున్న అర్చకులను ఆదుకునేందుకు ఉద్దేశించిన చక్కని పథకమిది’’అని ఢిల్లీ సీఎం అతిశి ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు. మరోవైపు ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ పరిధిలోని మసీదుల్లో సేవలందించే ఇమామ్‌లు కేజ్రీవాల్‌ నివాసం బయట ఆందోళకు దిగారు. ఇమామ్‌లకు అందాల్సిన నెలవారీ గౌరవ వేతనం రూ.18,000, ముయేజిన్‌లకు అందాల్సిన రూ.16వేల గౌరవ వేతనం గత ఏడాదిన్నరగా అందట్లేదని వారు నిరనసన తెలిపారు. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)