Breaking News

నేడే కేజ్రీవాల్‌ రాజీనామా

Published on Tue, 09/17/2024 - 05:11

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆప్‌ జాతీయ కనీ్వనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం రాజీనామా చేయనున్నారు. సాయంత్రం 4.30కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఆ సందర్భంగా ఎల్జీకి కేజ్రీవాల్‌ రాజీనామా లేఖ సమరి్పస్తారని ఆప్‌ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ సోమవారం మీడియాకు తెలిపారు. రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని, ప్రజలు గెలిపించాకే తిరిగి సీఎం కురీ్చలో కూర్చుంటానని కేజ్రీవాల్‌ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. 

ఢిల్లీ అసెంబ్లీకి నవంబర్లోనే ముందస్తు ఎన్నికలు పెట్టాలని కూడా ఆ సందర్భంగా ఆయన ఈసీని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజంతా ఆప్‌ నేతలతో కేజ్రీ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన ప్రకటనపై స్పందన ఎలా ఉందని పార్టీ అత్యున్నత నిర్ణాయక విబాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఆరా తీశారు. సీఎం అభ్యర్థిపై ఒక్కక్కరి నుంచీ వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు. అంతకుముందు ఉదయం కీలక నేతలు మనీశ్‌ సిసోడియా, రాఘవ్‌ ఛద్దా తదితరులతోనూ ఈ అంశంపై లోతుగా చర్చలు జరిపారు. 

సీఎం పదవికి మంత్రులు ఆతిశి, గోపాల్‌ రాయ్, కైలాశ్‌ గహ్లోత్, సౌరభ్‌ భరద్వాజ్‌ తదితరుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు స్పీకర్‌ రాంనివాస్‌ గోయల్, కేజ్రీవాల్‌ భార్య సునీత పేర్లపైనా లోతుగా చర్చ జరుగుతున్నట్టు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో 12 ఎస్సీ రిజర్వుడు శాసనసభ స్థానాలున్నాయి. కనీసం మరో ఆరు స్థానాల్లో మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో ఎస్సీ, లేదా మైనారిటీ నేతకు చాన్స్‌ దక్కొచ్చన్న వాదనా ఉంది. దాంతో ఎస్సీ, మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఆప్‌ ఎమ్మెల్యేల పేర్లు కూడా కొత్తగా తెరపైకి వస్తున్నాయి! మంగళవారం కేజ్రీవాల్‌ రాజీనామాకు ముందు ఉదయం 11.30కు ఆప్‌ లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశం జరగనుంది. సీఎం అభ్యర్థిపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మైనారిటీ వర్గానికి చెందిన ఆప్‌ ఎమ్మెల్యే ఇమ్రాన్‌ హుసేన్‌ పేరు ఖరారైనా ఆశ్చర్యం లేదని ఆప్‌ ముఖ్య నేత ఒకరు చెప్పడం విశేషం!

హరియాణాలో సుడిగాలి ప్రచారం! 
రాజీనామా అనంతరం కేజ్రీవాల్‌ హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తారని ఆప్‌ వర్గాలు చెబుతున్నాయి. హరియాణలో అక్టోబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. అక్కడ కాంగ్రెస్‌తో ఆప్‌ పొత్తు పెట్టుకోలేదు. మొత్తం 90 స్థానాల్లో ఒంటరిగానే అభ్యర్థులను బరిలోకి దింపింది. జమ్మూకశ్మీర్‌లో కూడా కేజ్రీవాల్‌ ప్రచారం చేస్తారని సమాచారం.  
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు