Breaking News

Delhi Election 2025: ​ప్రచారంలో మూమూస్‌ రుచిచూసిన కేజ్రీవాల్‌

Published on Mon, 01/20/2025 - 08:51

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

తాజాగా కేజ్రీవాల్ ప్రచారంలో  ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఉన్న ఒక దుకాణంలో కేజ్రీవాల్‌ మూమూస్‌ రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ నేతలతో పాటు ఒక దుకాణం దగ్గర మోమోస్‌ తింటూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ‘ఢిల్లీ వాసులకు, మోమోలకు మధ్య అనుబంధం విడదీయరానిది. ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న కేజ్రీవాల్‌ను స్వాగతిస్తూ ఒక మోమోస్‌ విక్రేత అతనికి మోమోస్‌ అందించారు’ అని రాసింది.
 

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన.. బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ లపై పోటీకి దిగారు. 2013 నుండి న్యూఢిల్లీ స్థానం నుండి అరవింద్ కేజ్రీవాల్  ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముక్కోణపు పోరుగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ కూడా  తన సత్తాను చాటేందుకు ఎన్నికల రంగంలోకి దిగింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.  ఫిబ్రవరి 5 ఓటింగ్‌ జరగనుండగా, ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడికానున్నాయి.

ఇది కూడా చదవండి: Delhi Election 2025: కేజ్రీవాల్‌, ఆతిశీ సహా ‘ఆప్‌’ స్టార్‌ క్యాంపెయినర్లు వీరే

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)