Breaking News

గోల్డెన్ టెంపుల్‌లోకి ఆయుధాల అనుమతి: కారణం ఇదే..

Published on Tue, 05/20/2025 - 19:51

అమృత్సర్‌లోని స్వర్ణ దేవాలయానికి పాకిస్తాన్ వల్ల ముప్పు ఉందని తెలియగానే రక్షణ వ్యవస్థల పటిష్టం చేశారు. ఆలయంలోకి తుపాకులను తీసుకెళ్లడానికి ఆలయ ప్రధాన గ్రంథి (గురుద్వార్ పర్యవేక్షకుడు) అనుమతించారని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ అధికారి సుమర్ ఇవాన్ పేర్కొన్నారు.

క్షిపణులను, డ్రోన్లను గుర్తించడానికి గోల్డెన్ టెంపుల్ లైట్లను ఆఫ్ చేయడానికి కూడా ఆలయ పర్యవేక్షకులు అనుమతిచ్చారు. కొన్నేళ్లుగా ఆలయంలో వెలుగుతున్న లైట్లను ఆపివేయడం బహుశా ఇదే మొదటిసారి. ఆలయ రక్షణ విషయంలో మాకు సహకరించిన స్వర్ణ దేవాలయ సిబ్బందికి.. లెఫ్టినెంట్ జనరల్ కృతఙ్ఞతలు తెలిపారు.

ప్రతిరోజూ లక్షలాది మంది సందర్శిస్తున్న అంతర్జాతీయ ఖ్యాతి గడించిన స్వర్ణ దేవాలయాన్ని కాపాడుకోవాలి. ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ ఈ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత సైన్యం తిప్పిగొట్టి.. దేవాలయం మీద చిన్న గీత కూడా పడకుండా అడ్డుకుంది.

పాకిస్తాన్ ఎప్పుడూ.. ఎక్కువ మంది జనాభా ఉన్న ప్రాంతాలను లేదా మతపరమైన ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ విషయాన్ని భారత సైన్యం ముందుగానే గ్రహించిందని లెఫ్టినెంట్ జనరల్ తెలిపారు. నిఘా వర్గాలు కూడా స్వర్ణ దేవాలయం మీద దాడులు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)