Breaking News

పదేళ్లుగా అధికారులను అరిగోస పెట్టిన అరికొంబన్‌.. చివరకు

Published on Mon, 05/01/2023 - 06:05

ఇడుక్కి(కేరళ): రేషన్‌ దుకాణాల్లోకీ, ఇళ్లలోకీ చొరబడి బియ్యాన్ని బొక్కేస్తున్న ఏనుగు అరికొంబన్‌(25)ను ఎట్టకేలకు కేరళ అటవీ అధికారులు పట్టుకుని, మరో చోటుకు తీసుకెళ్లి వదిలేశారు. అరికొంబన్‌ ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని, దానికి బిగించిన రేడియో కాలర్‌ ద్వారా టైగర్‌ రిజర్వులో ఎక్కడ ఉన్నదీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు. అరికొంబన్‌ మళ్లీ జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం లేవన్నారు.

ఇడుక్కి జిల్లా చిన్నకనల్, సంతన్‌పర కొండ ప్రాంతాల్లోని నివాసాల్లో దాదాపు దశాబ్ద కాలంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందీ గజరాజు. బియ్యం మాత్రమే స్వాహా చేస్తున్న ఈ గజరాజుకు అరి కొంబన్‌(మలయాళంలో అరి అంటే బియ్యం, కొంబన్‌ అంటే ఏనుగు)గా పేరు వచ్చింది. అరికొంబన్‌ను ఏం చేయాలన్న అంశం పలు వివాదాలకు దారితీసింది. అరికొంబన్‌ను పట్టుకుని, శిక్షణ ఏనుగు(కుమ్కి)గా మార్చేందుకు చేసిన ప్రయత్నాలను కేరళ హైకోర్టు అడ్డుకుంది.

హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అరికొంబన్‌ను జనావాసాలకు దూరంగా పరాంబికులమ్‌ టైగర్‌ రిజర్వులో వదిలి వేయాలని సూచించింది. దీనిపైనా నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి కేరళ ప్రభుత్వం సూచనలతో.. ఆ ఏనుగును వదిలి వేసే ప్రాంతాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచాలన్న ప్రత్యామ్నాయం ఆచరణలోకి వచ్చింది. దీని ప్రకారం..అరికొంబన్‌కు మత్తిచ్చేందుకు శనివారం ఉదయం నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి.

లాభం లేకపోవడంతో అరికొంబన్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న మరో ఏనుగును తీసుకొచ్చాక సాయంత్రానికి మత్తు ఇంజక్షన్‌ ఇవ్వడం సాధ్యపడింది. తర్వాత దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించి ర్యాంప్‌ మీదుగా వదిలిపెట్టినట్టు అధికారులు తెలిపారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)