Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 31 మంది మావోయిస్టుల మృతి

Published on Sun, 02/09/2025 - 11:18

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ నేషనల్‌ పార్క్‌ అడవుల్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన జవాన్లను హెలికాప్టర్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టులు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజాపూర్ జిల్లా కేంద్రంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

కాగా, మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నెలరోజుల్లో 100 మందికిపైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. మావోయిస్టుల ఏరివేత ప్రక్రియను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, నారాయణ్‌పూర్, బస్తర్ సహా పలు మావోయిస్టులు హవా ఉన్న జిల్లాల్లో భద్రతా బలగాలు, పోలీసుల ఆపరేషన్లు వేగవంతం చేశాయి. భద్రతా బలగాలు.. నక్సల్స్ ఎదురుపడగానే కాల్పులు జరుపుతున్నాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారు.

ఈ ఎన్‌కౌంటర్‌లలో భారీగా నక్సల్స్ మృతి చెందుతున్నారు. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్‌, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలు, నక్సల్స్‌కు జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మందికిపైగా మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో మరో మావోయిస్టు అగ్రనేత కూడా చనిపోయిన సంగతి తెలిసిందే.


 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)