Breaking News

కోపం ఒక లోపం...అది మనకే నష్టం

Published on Wed, 11/19/2025 - 12:52

Anger management జెన్‌ గురువు వద్దకు ఒక వ్యక్తి వెళ్లి, ‘నేను నా కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతున్నాను గురువుగారూ! దయచేసి నా కోపాన్ని వదిలించు కోవడానికి ఏదైనా మార్గం చెప్పండి’ అని అడిగాడు. చెప్పినదంతా విన్న గురువు ‘ఏదీ నీ కోపాన్ని కొంచెం నా పట్ల చూపించు’ అన్నారు. అయితే శిష్యుడు కోపాన్ని ఎలా చూపించాలో తెలియక అయోమయంలో పడ్డాడు. కోపం నుంచి బయట పడాలని నేననుకుంటుంటే ఈయన ఇలా అంటారేమిటీ అనుకున్నాడు. ప్రస్తుతానికి తాను కోపంగా లేను కనుక ఇప్పటికిప్పుడు కోపాన్ని చూపించలేనన్నాడు.

అయితే గురువు వదల్లేదు. ‘అది నా సమస్య కాదు. నీకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడే వచ్చి నాకు నీ కోపాన్ని చూపించు’ అన్నారు. ఇంతలో శిష్యుడికి నిజంగానే కోపం వచ్చి ‘నేను కోపంగా ఉన్నప్పుడు వెంటనే దానిని చూపించలేను. నాకెప్పుడు కోపం వస్తుందో చెప్పలేను. కొన్ని సమయాల్లో నేను కోపంగా ఉంటాను. అప్పుడు, నేను మీ వద్దకు వచ్చి మీకు వెంటనే చూపించలేను’ అన్నాడు. ()

అంతట గురువు ‘ఓహో అలాగా... అయితే నీ కోపం ఒక స్వభావం కానట్టే...’ అని అన్నారు. ‘కోపం నీ నిజమైన స్వభావమైతే, నువ్వు దానిని నాకు ఎప్పుడైనా చూపించగలవు. నువ్వు పుట్టినప్పుడు నీకు కోపం లేదు. నీ తల్లితండ్రులు దానిని నీకేమీ ఇవ్వలేదు. కాబట్టి కోపం బయటి నుంచే వచ్చి ఉండాలి. నువ్వు దానిని సులభంగా వదిలించుకోవచ్చు’ అని గురువు అన్నారు.

కోపం అనేది ఒక ఆమ్లం లాంటిది. ఆమ్లం ఎవరి మీద పడుతుందో వారికన్నా... దాన్ని నిల్వ చేసిన పాత్రకే ఎక్కువ హాని చేస్తుంది. కోపం మన సహజత్వాన్ని దెబ్బతీస్తుంది. కోపం అనేది ఒక లోపం. అది బయటకు వచ్చినప్పుడు ఎదుట ఉన్న వ్యక్తి కంటే కోపిష్ఠికే ఎక్కువ హాని చేస్తుంది. కనుక అది మనలో తిష్ఠ వేయకుండా చూసుకోవాలి. 
– యామిజాల జగదీశ్‌ 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)