పప్పాల్‌ప్రీత్‌ సింగ్‌ అరెస్ట్‌.. ఇక అమృత్‌పాల్‌ దొరికినట్టేనా?

Published on Mon, 04/10/2023 - 15:52

ఛండీఘర్‌: ఖలిస్తాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పంజాబ్‌ పోలీసులు సహా భద్రతా బలగాలు గాలిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే అమృత్‌పాల్‌ సిక్కులతో సమావేశమవుతారని ఇంటిలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. 

ఇదిలా ఉండగా, అమృత్‌పాల్‌ సింగ్‌ కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అమృత్‌పాల్ సింగ్ స‌న్నిహితుడు పప్పాల్‌ప్రీత్ సింగ్‌ను పంజాబ్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కాగా, గ‌త నెల‌లో వీరిద్దరూ పారిపోయిన విష‌యం తెలిసిందే. తాజాగా పంజాబ్‌ పోలీసులు పప్పాల్‌ సింగ్‌ను హోషియార్‌పూర్‌లో ప‌ట్టుకున్నారు. ఇక, అమృత్‌పాల్‌తో పాటు ప‌ప్పాల్‌సింగ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌లో అత‌ను చిక్కినట్టు పోలీసులు వెల్లడించారు. 

మరోవైపు.. అమృత్‌పాల్‌ సింగ్‌, పప్పాల్‌ సింగ్‌ కలిసి జలంధర్, హోషియార్‌పూర్, అమృత్‌సర్ జిల్లాల్లో ఆశ్రయం పొందారు. వీరిద్దరూ ఫగ్వారా పట్టణం, నాద్లోన్, బీబీ గ్రామంలోని మూడు వేర్వేరు డేరాలలో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం.. మార్చి 18వ తేదీ నుంచి అమృత్‌పాల్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)