Breaking News

సీతారాముల స్వస్థలాలు ‘అమృత్‌ భారత్‌’తో అనుసంధానం!

Published on Sat, 12/23/2023 - 13:08

శ్రీరాముని జన్మభూమి అయోధ్యతో సీతామాత పుట్టిన ‍ప్రాంతమైన సీతామర్హి(బీహార్‌) అనుసంధానం కానుంది. ఈ రెండు ప్రాంతాలను కలిపేలా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలు సాగించనుంది. ఈ ప్రత్యేక రైలు మొదటి పరుగును అతి త్వరలో అందుకోనుంది.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ్ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ డిసెంబర్‌ 30న రానున్నారు. ఈ సందర్భంగా మోదీ.. అయోధ్య జంక్షన్‌లో కొత్తగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించడమే కాకుండా, అయోధ్య నుంచి ఢిల్లీకి  నడిచే రెండు రైళ్లను ప్రారంభించనున్నారు. అంతే కాదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ రైలును కూడా  ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ- దర్భంగాల మధ్య నడవనుంది. 

మొదటి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన రెగ్యులర్ సర్వీస్ ఢిల్లీ- దర్భంగా మధ్య ఉంటుంది. ఈ రైలు దూర ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తం. మరో అమృత్ భారత్ రైలు బీహార్‌లోని సితామర్హి (జానకీ మాత జన్మస్థలం)-రక్సాల్ మీదుగా అయోధ్య గుండా ఢిల్లీకి చేరనుందని సమాచారం

అమృత్ భారత్ రైలు నాన్-ఏసీ రైలుగా ఉండబోతున్నదని తెలుస్తోంది. అంటే దీనిలో స్లీపర్, జనరల్ కోచ్‌లు మాత్రమే  ఉంటాయి. ఇందులో మొత్తం 22 బోగీలు ఉండనున్నాయి.  దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ రాత్రిపూట రైలు సర్వీసులుగా నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పని చేయడానికి వచ్చే వలస బీహారీలను దృష్టిలో ఉంచుకుని ఈ రైలు ‍ప్రవేశపెట్టనున్నారని రైల్వే అధికారులు తెలిపారు. 
ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్‌ తప్పనిసరి.. ఆదేశాలు జారీ!

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)