Breaking News

ఇండో-నేపాల్ బోర్డర్‌లో అమెరికా మాజీ సైనికుడి అరెస్ట్‌?

Published on Tue, 07/14/2026 - 02:10

భారత్ నుంచి నేపాల్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒక అమెరికా పౌరుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద శశస్త్ర సీమా బల్(SSB) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.  సోనౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైనిహ్వా ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు  పీటీఐ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. 

కాగా పట్టుబడిన వ్యక్తిని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జోర్డాన్ బ్రౌన్ (36) గా గుర్తించారు. తనిఖీ కోసం అధికారులు ఆపినప్పుడు బ్రౌన్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఎస్ఎస్‌బీ సిబ్బంది అతడిని వెంటాడి మరీ అదుపులోకి తీసుకున్నారు. 

 స్థానిక ప్రజల మధ్య, బ్రౌన్ కాలికి తాడు కట్టి భద్రతా సిబ్బంది తీసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే భద్రతా బలగాల విచారణలో సదరు విదేశీయుడికి సంబంధించిన సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. బ్రౌన్ ఎలాంటి ప‌త్రాలు లేకుండానే గ‌తేడాది నవంబ‌ర్‌లో సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించాడని, అప్పటి నుంచి గోవాలో నివసిస్తున్నట్లు మహారాజ్‌గంజ్ అడిషనల్ ఎస్పీ సిద్ధార్థ్ తెలిపారు. 

"అత‌డు టూరిస్ట్ వీసాపై థాయిలాండ్ వెళ్లాడని, అక్కడ తన పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడని విచారణలో చెప్పాడు. ఆ తర్వాత సముద్ర మార్గంలో శ్రీలంకకు చేరుకుని, అక్కడి నుండి 2025 నవంబర్ 2న సముద్ర మార్గం ద్వారానే భారత్‌కు వచ్చాడు. అప్పటి నుండి గోవాలో ఉంటున్నాడు" అని ఆయన పేర్కొన్నారు. కాగా

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. నిందితుడు జోర్డాన్ బ్రౌన్ పోలీసులకు రకరకాల సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదివానని, 2024 వరకు దాదాపు ఆరేళ్ల పాటు యూఎస్ నేవీ, ఫారిన్ సర్వీసెస్‌లో పనిచేశానని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం నిఘా సంస్థలు, స్థానిక పోలీసులు ఈ చొరబాటు వెనుక ఉన్న అసలు కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)