Breaking News

మూడు లక్షలకు అమర్‌నాథ్‌ యాత్రికుల సంఖ్య

Published on Sun, 07/14/2024 - 10:48

అమర్‌నాథ్‌లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు జమ్ముకశ్మీర్‌కు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శనివారం  అమరనాథుణ్ణి 14,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 2,93,929 మంది భక్తులు  అమర్‌నాథ్‌కు తరలివచ్చారు.

అమరనాథుణ్ణి త్వరగా దర్శించుకోవాలనే ఉత్సాహం  భక్తుల్లో కనిపిస్తోంది. ఇందుకోసం టోకెన్లు పొందేందుకు, భక్తులు తెల్లవారుజాము నుంచే సేవా కేంద్రాలకు చేరుకుంటున్నారు. తాజాగా 1,630 మంది భక్తులు 74 చిన్న, పెద్ద వాహనాల్లో జమ్ము నుంచి బల్తాల్‌కు బయలుదేరారు. వీరిలో 1068 మంది పురుషులు, 546 మంది మహిళలు, 16 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా పహల్గాం మార్గంలో 109 చిన్న, పెద్ద వాహనాల్లో 3039 మంది భక్తులు కశ్మీర్‌కు తరలి వెళ్లారు. వీరిలో 2350 మంది పురుషులు, 584 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు, 96 మంది సాధువులు, ఇద్దరు సాధ్వులు ఉన్నారు. కాగా ఆగస్టు 19న అమర్‌నాథ్ యాత్ర ముగియనుంది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)