Breaking News

అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ

Published on Wed, 06/26/2024 - 08:12

అమర్‌నాథ్ యాత్రకు వచ్చే మహాశివుని భక్తుల కోసం జమ్మూ సిద్ధమయ్యింది. జూన్ 26 నుంచి తత్కాల్ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాల్లో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు టోకెన్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. నేటి(బుధవారం) నుంచి టోకెన్లు జారీ చేయనున్నారు. గురువారం నుంచి టోకెన్ తీసుకునే యాత్రికులకు తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

ఏడీసీ శిశిర్ గుప్తా రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను సందర్శించి యాత్రకులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎండ నుంచి రక్షణకు కేంద్రాల వద్ద షెడ్లు, టెంట్లు వేస్తున్నమని, తాగునీరు, ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని గుప్తా తెలిపారు. సరస్వతి ధామ్, జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలో భక్తులు తమ ప్రయాణపు టోకెన్లు అందుకోవచ్చు. అనంతరం కేంద్రంలో యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం వారు గాంధీనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రి, సర్వల్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాల్సి ఉంటుంది.

యాత్రికుల కోసం బేస్ క్యాంప్ అయిన బాల్తాల్‌లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. జూన్ 29 నుంచి వార్షిక అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. జూన్ 28, శుక్రవారం నాడు జమ్ము నగరంలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి యాత్రికుల బృందం కశ్మీర్ వ్యాలీకి బయలుదేరనుంది. 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు