Breaking News

అమర్‌నాథ్‌ యాత్ర రికార్డులు బద్దలు!

Published on Mon, 08/12/2024 - 10:13

అమర్‌నాథ్ యాత్రికులు గత రికార్డులను బద్దలుకొట్టారు. యాత్ర ప్రారంభమైన తొలిరోజు నుంచే అమర్‌నాథ్‌ దర్శనానికి భక్తులు బారులు తీరారు. యాత్ర ముగియడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే అమర్‌నాథ్‌ సందర్శకుల సంఖ్య గత 12 సంవత్సరాల రికార్డును అధిగమించింది.

జూన్ 29 నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటివరకు 5.10 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహను సందర్శించారు. 2011లో యాత్రా సమయంలో మొత్తం 6.34 లక్షల మంది భక్తులు, 2012లో 6.22 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని సందర్శించుకున్నారు. ఈసారి యాత్ర ఆగస్ట్ 19న రక్షాబంధన్ రోజున ముగియనుంది.

అమర్‌నాథ్‌ను ఇప్పటి వరకు సందర్శించిన భక్తుల సంఖ్య 5,11,813 దాటింది. వర్షం కారణంగా పహల్గామ్, బాల్తాల్ మార్గంలో యాత్ర ఒక్కసారి మాత్రమే వాయిదా పడింది. గత ఏడాది జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో యాత్ర నాలుగుసార్లు వాయిదా పడింది. యాత్ర సాగే రెండు మార్గాల్లో 125 లంగర్లు ఏర్పాటు చేయడంతో భక్తులకు ఆహారానికి ఎటువంటి ఇబ్బంది కలుగలేదు.  జమ్మూలోని యాత్రి నివాస్‌, చంద్రకోట్‌ యాత్రి నివాస్‌, శ్రీనగర్‌లోని పాంథా చౌక్‌లలో తాత్కాలిక శిబిరంలో యాత్రికులకు వసతి, వైద్య సదుపాయాలు కల్పించారు. గత 12 ఏళ్లలో అమర్‌నాథ్‌ను సందర్శించుకున్న భక్తుల సంఖ్య ఇలా ఉంది.

సంవత్సరం     యాత్రికుల సంఖ్య
2011                     6.34 లక్షలు

2012                     6.22 లక్షలు

2013                    3.53 లక్షలు

2014                    3.73 లక్షలు

2015                    3.52 లక్షలు

2016                   2.20 లక్షలు

2017                  2.60 లక్షలు

2018                 2.85 లక్షలు

2019               3.42 లక్షలు

2020, 2021లలో కరోనా కారణంగా యాత్ర జరగలేదు.

2022             3.04 లక్షలు

2023             4.50 లక్షలు

2024           ఇప్పటివరకు 5.10 లక్షలు
 

Videos

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)