Breaking News

అమర్‌నాథ్‌కు పెరిగిన భక్తుల సంఖ్య!

Published on Sat, 04/06/2024 - 08:19

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికి 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్‌ 370ని తొలగించడమే కారణమని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. దీనిని తొలగించకముందు మధ్యప్రదేశ్‌ నుంచి ఏటా అరమ్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య 26 నుంచి 30 వేలు కాగా, దీనిని తొలగించిన తర్వాత యాత్రికుల సంఖ్య 40 వేలకు చేరుకుంది. 

ఈ  ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 29 నుండి ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 19 న రక్షాబంధన్ వరకు కొనసాగనుంది. అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు భక్తుల ప్రయాణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ తేదీని ప్రకటించిన వెంటనే ప్రయాణికులు రైలు రిజర్వేషన్ల కోసం ప్రయత్నించనున్నారు. అయితే కొందరు ప్రయాణ తేదీలను అంచనా వేస్తూ రిజర్వేషన్లు చేయించుకుటున్నారని సమాచారం. 

ఈసారి మధ్యప్రదేశ్‌ నుంచి అమర్‌నాథ్‌ వెళ్లే యాత్రికుల సంఖ్య 45 వేలు దాటుతుందని ఓం శివసేవా శక్తి మండల్ సంస్థ అంచనా వేసింది. ఎంపీ నుంచి 2018లో 35 వేల మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. 2019లో 30 వేల మంది అమర్‌నాథ్‌ యాత్ర చేశారు. అయితే 2020, 2021లలో కరోనా కారణంగా అమర్‌నాథ్‌ యాత్ర జరగలేదు. 2022లో 35 వేల మంది, 2023లో 40 వేల మంది అమర్‌నాథ్‌ను దర్శించుకున్నారు. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)