Breaking News

నలుగురిలో ఒకరు ట్యూషన్కు!

Published on Tue, 09/16/2025 - 06:28

పాఠశాల విద్యార్థుల్లో దాదాపు నలుగురిలో ఒకరు ఇప్పుడు ట్యూషన్లు లేదా ప్రైవేట్‌ కోచింగ్‌ మీద ఆధారపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంది. ట్యూషన్ల కోసం ఏటా ప్రతి విద్యార్థిపై చేస్తున్న సగటు వ్యయం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో దాదాపు రెండింతలు అధికంగా ఉండడం గమనార్హం.    – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

జాతీయ నమూనా సర్వే (ఎన్స్ ఎస్‌ఎస్‌) 80వ రౌండ్‌ కింద కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్‌–జూన్‌ మధ్య విద్యపై సమగ్ర సర్వే చేపట్టింది. అడ్మిషన్ల విషయంలో గ్రామీణ భారతంలో ప్రభుత్వ పాఠశాలలదే పైచేయిగా ఉందని సర్వే తేల్చింది. పట్టణ ప్రాంత కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నాయి అంతేకాదు మార్కుల వేటలో భాగంగా తమ పిల్లలను ట్యూషన్లకూ పంపిస్తున్నాయి.

ట్యూషన్ల కోసం వ్యయం
ప్రస్తుత విద్యా సంవత్సరంలో దేశంలో 27 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా చూస్తే పట్టణాల్లో 30.7%, గ్రామీణ భారత్‌లో 25.5% మంది ప్రైవేట్‌ కోచింగ్‌పై ఆధారపడ్డారు. దేశంలో సగటున ఒక్కో విద్యార్థి ట్యూషన్స్  కోసం రూ.2,409 వెచ్చిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కోచింగ్‌ కోసం సగటు ఖర్చు రూ.1,793 కాగా, పట్టణాల్లో రూ.3,988 అవుతున్నట్టు అంచనా. ఇంటర్‌ స్థాయిలో పట్టణ కుటుంబాలు కోచింగ్‌ కోసం ఒక్కో విద్యార్థికి రూ.9,950 ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.4,548.

పట్టణాల్లో ప్రైవేట్‌ విద్యకు..
గ్రామీణ ప్రాంతాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 33.9% మంది ప్రైవేట్, ఇతర సంస్థలలో చదువుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కేవలం 30.1% మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు 70% మంది ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో  చదువుకుంటున్నారు. మొత్తంగా దేశ సగటు చూ స్తే.. అడ్మిషన్లలో 55.9% వాటా ప్రభుత్వ పాఠశాలలదేనని సర్వే పేర్కొంది.

పట్టణ ప్రాంతాల్లో అధికం
ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులు ఉండవు. కానీ, ట్యూషన్లు, ర వాణా, స్టేషనరీ, ఇతర ఖర్చులు పెరిగాయి. ప్రైవేటులో అయితే వీటికి ఫీజు, యూనిఫాం వంటివి అదనంగా చేరతాయి. దీంతో ప్రతి విద్యా ర్థికి అవుతున్న వార్షిక వ్యయం రూ.23,470గా సర్వే అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.8,382గా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే.. పట్టణ ప్రాంత విద్యార్థికి రూ.4,128, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,639 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వేతర పాఠశాలల విషయంలో ఇది.. పట్టణప్రాంతాల్లో రూ.31,782, గ్రామీణ ప్రాంతాల్లో 19,554గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఫీజుల కోసం చేస్తున్న సగటు వార్షిక వ్యయం రూ.15,143 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.3,979.

⇒ ఇంటర్మీడియెట్‌ చదువుతున్న విద్యార్థుల విషయంలో దేశంలో 37% మంది ప్రైవేట్‌ కోచింగ్‌కు సై అంటున్నారు. పట్టణాల్లోని ఇంటర్‌ స్టూడెంట్స్‌లో 44.6 మంది ట్యూషన్లకు వెళ్తున్నారు.
⇒   ప్రైవేట్‌ ట్యూషన్స్  కోసం దేశంలో ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు సగటున ఏటా రూ.6,384 ఖర్చు పెడుతున్నారు. 
⇒   కోచింగ్‌ సంస్థలు చెల్లించిన వస్తు, సేవల పన్ను 2019–20లో రూ.2,240 కోట్లు. 2023–24కి వచ్చేసరికి ఇది రూ.5,517 కోట్లకు చేరింది.
⇒   కోచింగ్‌ కోసం అమ్మాయిల కంటే అబ్బాయిలు కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఏటా అమ్మాయిలు రూ.2,227, అబ్బాయిలు రూ.2,572 వ్యయం చేస్తున్నట్టు సర్వే పేర్కొంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)