దేశానికి ముగ్గురు ప్రధానులను అందించిన యూనివర్శిటీ ఏది?

Published on Fri, 04/26/2024 - 13:07

దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు ఎన్నో ఉన్నాయి.  వీటిలో చదువుకున్నవారు ఉన్నత స్థానాలకు చేరుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే దేశంలోని ఆ విశ్వవిద్యాలయం మనకు ముగ్గురు ప్రధానమంత్రులను, రాష్ట్రపతిని అందించింది. 

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ యూనివర్సిటీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశానికి ముగ్గురు ప్రధాన మంత్రులను అందించిన ఘనత ఈ యూనివర్శిటీకే దక్కుతుంది. మాజీ ప్రధానులు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, గుల్జారీలాల్ నందాలు తమ ఉన్నత విద్యను ఇక్కడే కొనసాగించారు. 

దేశంలోని నాలుగు పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 27,28 తేదీలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుంది. ఇందుకోసం వర్సిటీ  ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. యూనివర్సిటీలో పూర్తిస్థాయి విద్యార్థుల సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి. దీనిలో 1996 నుంచి ఇప్పటివరకు ఇక్కడ విద్యనభ్యసించినవారు పాల్గొననున్నారు. దీనిలో పాల్గొనేందుకు 1,100 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 

మాయో భవనం అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని పురాతన భవనం. ఇందులో ఇంతకుముందు మయో కాలేజీ నడిచేది. ఇది కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. అయితే 1887 సెప్టెంబర్ 23న అలహాబాద్ విశ్వవిద్యాలయం స్థాపన తర్వాత, ఇక్కడ సైన్స్ ఫ్యాకల్టీ విభాగం ఏర్పడింది. ఇక్కడ భౌతిక శాస్త్రానికి సంబంధించి జరిగిన పలు పరిశోధనలు  సరికొత్త రికార్డులు సృష్టించాయి. 

అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలకు ప్రత్యేక ప్రయోగశాలలు ఉన్నాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నేపధ్యలో అన్ని విభాగాలను అలంకరించారు. ఈ యూనివర్శిటీ విద్యార్థి రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ యూనివర్శిటీలో చదువుకున్న నారాయణ్ దత్ తివారీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన అలహాబాద్ యూనివర్సిటీ నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)