నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు

Published on Sat, 04/12/2025 - 06:18

అలహాబాద్‌:  కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఓ న్యాయవాదికి అలహాబాద్‌ హైకోర్టు ఆరు నెలల జైలుశిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అద­నంగా నెల రోజులపాటు జైలుశిక్ష అనుభవించాలని స్పష్టంచేసింది. జస్టిస్‌ వివేక్‌ చౌదరి, జస్టిస్‌ బి.ఆర్‌.సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. 

ల­క్నో­లోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని అశో­క్‌ పాండేను ఆదేశించింది. శిక్షకు గురైన లాయర్‌ అశోక్‌ పాండే చేసిన నేరం ఏమిటంటే కోర్టులో విధులకు హాజరైనప్పుడు నల్లకోటు ధరించలేదు. చొక్కాకు గుండీలు సరి­గ్గా పెట్టుకోలేదు. 2021 ఆగస్టులో ఓ కేసులో వాదించేందుకు అశోక్‌ పాండే హైకోర్టుకు హా­జ­రయ్యారు. 

నిబంధనల ప్రకారం నల్లకోటు ధరించకుండా, చొక్కాలు గుండీలు సరిగ్గా లేకుండా వచ్చిన పాండేను న్యాయమూర్తి మందలించారు. ఇలా చేయడం కోర్టు ధిక్క­రణే అవుతుందని చెప్పారు. వెంటనే బయటకు వెళ్లిపోవాలని ఆదేశిచారు. దాంతో ఆగ్రహానికి గురైన అశోక్‌ పాండే న్యాయమూర్తులంతా గూండాలు అంటూ విమర్శించారు. ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్న అశోక్‌ పాండే ప్రవర్తన సక్రమంగా లేద­ని, అతడికి జైలుశిక్ష, జరిమానా విధించడం సబబేనని ధర్మాసనం తేల్చిచెప్పింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)