Breaking News

ఇంఫాల్ గగనతలంలో కలకలం.. రంగంలోకి రఫెల్

Published on Mon, 11/20/2023 - 16:50

ఇంఫాల్: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై గుర్తు తెలియని వస్తువు(యూఎఫ్‌ఓ)ను గాలించేందుకు భారత వాయుసేన రఫెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. హసిమారా నుంచి రెండు రఫెల్ విమానాలను ప్రయోగించింది. కానీ రఫెల్ విమానాలు ఆ అనుమానిత వస్తువును గుర్తించలేకపోయాయి. ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో తిరిగొచ్చాయని అధికారులు తెలిపారు. 

గగనతలంలో గుర్తుతెలియని వస్తువులు ఆదివారం మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కనిపించినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత ఆ వస్తువు కనిపించకుండా పోయిందని తెలిపారు.

గుర్తు తెలియని వస్తువులను పసిగట్టడానికి వాయు సేన హషిమార నుంచి రఫెల్ యుద్ధ విమానాన్ని పంపించింది. అత్యాధునిక సెన్సార్లు కలిగిన ఈ విమానం అత్యంత ఎత్తులో గాలించినప్పటికీ ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో వెనక్కి వచ్చింది. కాసేపటికీ మరో రఫెల్‌ను అధికారులు పంపించారు. అప్పుడు కూడా ఎలాంటి వస్తువు కనిపించకలేదని అధికారులు తెలిపారు. యూఎఫ్‌వో కారణంగా మూడు గంటల పాటు విమానరాకపోకలకు అంతరాయం కలిగింది. 

ఇదీ చదవండి: Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు


 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)