Ayodhya Event: సెలవుపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్

Published on Sun, 01/21/2024 - 11:50

ఢిల్లీ: అయోధ్య రామ మందిర వేడుకకు ఆఫ్ డే సెలవు ప్రకటనపై ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వెనక్కి తగ్గింది. మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని రేపు మధ్యాహ్నం 2.30 గంటల వరకు నాన్ క్రిటికల్ సర్వీస్‌లను మూసివేయాలన్న నిర్ణయాన్ని ఈరోజు వెనక్కి తీసుకుంది. నాన్-క్రిటికల్ సర్వీస్‌లలోని సిబ్బందికి రేపు సగం రోజు విరామం ప్రకటించడంపై నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే.

ఎయిమ్స్-ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్ రేపు ఆఫ్‌ డే సలవు అని పేర్కొంటూ మెమోరాండం జారీ చేశారు. రేపు ప్రభుత్వ సిబ్బందికి హాఫ్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. "22.01.2024న 14.30 గంటల వరకు ఎయిమ్స్ హాఫ్ డే సెలవు ఉంటుందని ఉద్యోగులందరి సమాచారం" అని మెమోరాండం పేర్కొంది. అయినప్పటికీ, "అన్ని క్రిటికల్ క్లినికల్ సేవలు" నడుస్తాయని పేర్కొన్నారు.  

ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) సేవలు అందుబాటులో ఉంటాయో లేదో అధికారిక నోట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ ఇలాంటి రోజుల్లో అవుట్‌డోర్ పేషెంట్లు వైద్యులను సంప్రదించలేమని భయపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. రోగులు నెలల తరబడి వేచి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీడీ సేవలు నిలిపివేస్తే రోగులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని మండిపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకుంది. 

ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..!


 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)