Breaking News

భారత రక్షణ రంగంలో సరికొత్త పాఠాలు

Published on Fri, 10/03/2025 - 14:04

న్యూఢిల్లీ: భారతదేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు మరో కీలక అడుగు పడింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE), ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్ సంఘం (SIDM) సంయుక్తంగా డిఫెన్స్ టెక్నాలజీలో మైనర్ డిగ్రీ కోసం మోడల్ కరికులమ్‌ను విడుదల చేశాయి. 

ఈ కొత్త విద్యా కార్యక్రమం ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు విమానయాన, నావికా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీ, అధునాతన పదార్థాలు వంటి రక్షణ రంగానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ జీ సతీష్‌రెడ్డి నేతృత్వంలో ఈ కరికులమ్‌ తయారైంది. 

ఈ కరికులమ్‌ ప్రకారం.. ఉన్నత రక్షణ సాంకేతికతలపై ప్రత్యేక మాడ్యూల్స్, అలాగే పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా ప్రాక్టికల్ శిక్షణ అందిస్తారు. తద్వారా విద్యా వ్యవస్థ, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, రక్షణ రంగానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)