Breaking News

దూసుకొస్తున్న రైలు.. ఎదురుగా 60 ఏనుగులు.. తరువాత?

Published on Sat, 10/19/2024 - 11:58

గౌహతి: అస్సాంలో తృటిలో రైలు ప్రమాదం తప్పింది.  లోకో పైలట్‌ అప్రమత్తతతో దాదాపు 60 ఏనుగులు ప్రమాదం బారి నుంచి బయపడ్డాయి. అర్దరాత్రి ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటుతోంది.. ఇంతలో ఒక రైలు  అతివేగంతో అదే పట్టాల మీదుగా వస్తోంది. అయితే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)భద్రతా వ్యవస్థ లోకో పైలట్‌కు సిగ్నల్ రూపంలో ఈ విషయాన్ని తెలిపింది. వెంటనే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం అక్టోబర్ 16న కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్న లోకో పైలట్‌ జెడీ దాస్, అతని సహాయకుడు ఉమేష్ కుమార్ రాత్రి 8.30 గంటలకు హవాయిపూర్- లాంసాఖాంగ్ స్టేషన్‌ల మధ్య రైల్వే ట్రాక్‌ను దాటుతున్న ఏనుగుల గుంపును చూశారు. ఆ రైలు గౌహతి నుంచి లుమ్‌డింగ్‌కు వెళ్తోంది. వారు ఏనుగులను చూడగానే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేసి, ఏనుగుల గుంపునకు కొద్ది దూరంలో రైలును ఆపారు. దీంతో 60 ఏనుగులు ప్రమాదం బారి నుంచి బయటపడ్డాయి.

ఈస్ట్ సెంట్రల్ రైల్వే తన పరిధిలోని అన్ని కారిడార్‌లలో  ఏఐ వ్యవస్థను క్రమంగా నెలకొల్పుతోంది. రైల్వే ట్రాక్‌లోకి ప్రవేశించిన ఏనుగుల ప్రాణాలను కాపాడడంలో ఈ వ్యవస్థ విజయవతంగా పనిచేస్తోంది. తూర్పు మధ్య రైల్వే 2023లో 414 ఏనుగులను, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 16 వరకు 383 ఏనుగులను రక్షించింది.

ఇది కూడా చదవండి: Subrahmanyan Chandrasekhar: చుక్కల్లో చంద్రుడు

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)