Breaking News

47మృతదేహాల గుర్తింపు

Published on Mon, 06/16/2025 - 04:40

అహ్మదాబాద్‌: ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఆదివారానికి గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రుపానీ సహా 47 మంది మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు. 24 మృతదేహాలను సంబందీకులకు అప్పగించారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు 230 బృందాలను ఏర్పాటు చేశారు. ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌ గురువారం కుప్పకూలిన ఘటనలో రుపానీ సహా 242 మంది ప్రయాణికులు మృత్యువాతపడగా ఒకే ఒక్క వ్యక్తి సజీవంగా బయటపడటం తెల్సిందే. విమానం పడిన ప్రాంతంలో ఉన్న ఐదుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులు సహా 33 మంది సైతం ప్రాణాలు కోల్పోయారు.

గుర్తు పట్టలేనంతంగా మాడి మసవ్వడంతో అధికారులు సంబందీకుల నుంచి సేకరించిన డీఎన్‌ఏ ద్వారా మృతదేహాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. 230 మంది ప్రయాణికుల చిరునామాలు సేకరించారు. మృతి చెందిన ప్రయాణికుల్లో ముగ్గురి సంబం«దీకులు మాత్రం ఇప్పటి వరకు డీఎన్‌ఏ నమూనాలను ఇవ్వలేదని చెప్పారు. మిగతా వారి విషయంలో సంబందీకులకు డెత్‌ సర్టీఫికెట్‌లను సైతం అందజేస్తున్నామన్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీకే మిశ్రా ఆదివారం ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనా క్రమాన్ని అధికారులు ఆయనకు వివరించారు.

క్షతగాత్రులను పీకే మిశ్రా పరామర్శించారు. విమాన ప్రమాదానికి కారణాలపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాసిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(ఏఏఐబీ) ప్రధానంగా దర్యాప్తు జరుపుతోంది. ఆదివారం ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన విదేశీ బృందానికి అహ్మదాబాద్‌ ఫైర్‌ బ్రిగేడ్‌ అధికారులు వివరాలను అందించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం ఢిల్లీలో మొదటిసారిగా సమావేశం కానుంది. మూడు నెలల్లోగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)