Breaking News

ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన 

Published on Tue, 07/25/2023 - 13:16

 లక్నో: మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఓ వ్యక్తి గిరిజనుడిపై మూత్రం పోసిన సంఘటన మరువక ముందే ఆగ్రాలో అలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఉన్న ఓ వ్యక్తిపై మూత్రం పోస్తూ వీడియో తీసుకున్నాడు మరో ప్రబుద్ధుడు. 

మానవత్వానికి కళంకంగా నిలిచే సంఘటనలు ఒకదాని వెంట మరొకటి చోటు చేసుకంటూనే ఉన్నాయి. సమాజంలో ఇప్పటికీ వివక్షలు చాపకింద నీరులా ప్రబలుతూనే ఉన్నాయి. మొన్న మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి అమానుషంగా గిరిజనుడిపై మూత్రం పోసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగడంతో సదరు నిందితుడు కటకటాల పాలవడమే కాకుండా అతని ఇల్లు కూడా నేలమట్టం చేశారు. 

ఒకపక్క ఇటువంటి చర్యలపై చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొంతమంది వాటిని ఖాతరు చేయడం లేదు. మధ్యప్రదేశ్ ఉదంతం గురించి తెలిసి కూడా ఆగ్రాలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిద్రిస్తున్న మరో వ్యక్తిని కాలితో నిర్దాక్షిణ్యంగా తన్నుతూ ముఖం మీద మూత్రం పోశాడు. దీన్ని అతని స్నేహితుడు వీడియో తీశాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మూత్రం పోసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని వెతుకులాట కొనసాగుతోందని తెలిపారు.   

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వీడియో ఇప్పటిది కాదని మూడు నాలుగు నెలల క్రితం వీడియో అని ఇప్పుడు వైరల్ అయ్యిందని చెబుతూ మూత్రం పోసిన వ్యక్తిని ఆదిత్యగా, వీడియో తీసిన వ్యక్తి అటుస్ గా గుర్తించినట్టు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కూడా చదవండి: చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్            

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)