Breaking News

Adipurush controversy: అయోధ్యలో ‘ఆది పురుష్‌’ సెగలు.. శ్రీరామ సేన సారధ్యంలో..

Published on Tue, 06/20/2023 - 09:56

హీరో ప్రభాస్‌ నటించిన ‘ఆది పురుష్‌’ సినిమా విడుదల కాగానే.. ఆ సినిమాపై విమర్శల దాడి మొదలయ్యింది. ఈ చిత్రంపై ఆధ్యాత్మిక ప్రాంతాలుగా పేరుగాంచిన వారణాసి మొదలుకొని హరిద్వార్‌ వరకూ కూడా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో ‘ఆది పురుష్‌’పై జనాగ్రహం వ్యక్తమవుతోంది. నగరంలోని శ్రీరామ సేన కార్యకర్తలు ‘ఆది పురుష్‌’ ప్రదర్శితమవుతున్న థియేటర్ల నుంచి ప్రేక్షకులను బయటకు పంపిస్తూ, ఆయా థియేటర్లను మూసివేయిస్తున్నారు.

రూ. 500 కోట్ల బారీ బడ్జెట్‌తో నిర్మితమైన ‘ఆది పురుష్‌’పై మొదలైన ఆందోళనలు ఇప్పట్లో ఆగేలా లేవు. దేశవ్యాప​ంగా ఈ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలుచోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.ఇదే కోవలో రామజన్మభూమి అయిన అయోధ్యలో ‘ఆది పురుష్‌’పై ఆందోళనలు మిన్నంటాయి. ఈ ప్రాంతానికి చెందిన హిందూ సంస్థలు ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను మూసివేయిస్తున్నాయి. 

శ్రీరామ సేన కార్యకర్తలు ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల ముందు ఆందోళనలు నిర్వహిస్తూ, ప్రదర్శనలను మధ్యలోనే నిలిపివేయిస్తున్నారు. థియేటర్లలోకి చొరబడిన శ్రీరామ సేన కార్యకర్తలు కాషాయ జండాలు ప్రదర్శిస్తూ, ‘జై శ్రీరామ్‌’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పోలీసుల సమక్షంలోనే సినిమా ప్రదర్శనను నిలిపివేయిస్తున్నారు. 

ఈ సందర్భంగా శ్రీరామ సేన రాష్ట్ర అధ్యక్షుడు దినే సింగ్‌ మాట్లాడుతూ ‘అసంబద్ధమైన సినిమా రూపొందించారు. మన సంస్కృతిని కించపరిచారు. దీనిని అయోధ్యలో ప్రదర్శించబోనీయం. ‘ఆది పురుష్‌’ సినిమాను అయోధ్యలో ఎట్టిపరిస్థితిలోనూ ఆడబోనీయం’ అని స్పష్టం చేశారు.

వారణాసి మొదలు హరిద్వార్‌ వరకూ..
‘ఆది పురుష్‌’ సినిమాపై వారణాసి మొదలు అయోధ్య వరకూ ఆందోళనల పర్వం కొనసాగుతోంది. అఖిల భారతీయ సంత్‌ సమితి ప్రతినిధి జితేంద్రానంద మాట్లాడుతూ ఈ సినిమాలోని డైలాగులు స్వామీజీలకే అర్థం కావడంలేదని, సనాతన ధర్మానికి సంబంధించిన సాక్ష్యాలను వక్రీకరించారన్నారు. 

హరిద్వార్‌లోనూ ‘ఆది పురుష్‌​’ సినిమాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి హిందూ సంఘాలు ఈ సినిమాను చూడొద్దంటూ ప్రేక్షకులను కోరుతున్నాయి. ప్రభుత్వం ఈ సినిమాపై తాత్కాలికంగానైనా నిషేధం విధించాలని కోరుతున్నాయి.  

ఇది కూడా చదవండి: ‘ఆది పురుష్‌’పై అఖిల భారత హిందూ సభ విమర్శల బాణం!  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)