Breaking News

కన్నడ వర్ధమాన నటి రన్య రావు అరెస్ట్‌

Published on Thu, 03/06/2025 - 07:31

చందనాన్ని స్మగ్లింగ్‌ చేస్తాడు. ఈ అందాల నటి నిజ జీవితంలో బంగారాన్ని దొంగ రవాణా చేయసాగింది. తరచూ విమానాల్లో ప్రయాణాలు, చుట్టరికాల మద్దతుతో హాలీవుడ్‌ సినిమా స్థాయిలో కేజీల కొద్దీ బంగారం బిస్కెట్లు, నగలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. విధి వక్రించి అరెస్టయ్యింది.

బనశంకరి: అరబ్‌ దేశాలనుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన కన్నడ వర్ధమాన నటి, ఓ డీజీపీ బంధువు రన్య రావు విచారణలో డొంకంతా కదులుతోంది. ఆమె నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.17.29  కోట్ల విలువైన పసిడి, నగదును సీజ్‌ చేశారు. ఈమె దుబాయ్‌ నుంచి 14.8 కేజీల బంగారాన్ని తీసుకొస్తూ సోమవారం రాత్రి బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో దొరికిపోవడం తెలిసిందే. అప్పటినుంచి ఆమెను డీఆర్‌ఐ అధికారులు విచారిస్తున్నారు.  

ఇంటిలో బంగారం నిల్వలు  
బెంగళూరు ల్యావెల్లీ రోడ్డు నందవాణి మ్యాన్సన్‌ నివాసంలో నటి రన్య రావు నివసిస్తోంది. ఆమె నెలకు రూ.4.5 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఆ ఇంటిలో వెతికేకొద్దీ బంగారు బిస్కెట్లు, కడ్డీలు, ఆభరణాలు లభించాయి. మంగళవారం నుంచి సోదాలు నిర్వహించి రూ.2.06 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.2.67 కోట్ల నగదు కూడా లభించింది. ఆమె నుంచి రూ.12.56 కోట్ల విలువచేసే 14.2 కిలోల విదేశీ బంగారం, రూ.4.73 కోట్ల విలువచేసే ఇతర ఆస్తులను జప్తు చేసుకున్నామని డీఆర్‌ఐ ప్రకటించింది. 

14 రోజుల రిమాండు 
ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టులో రన్య ను హాజరుపరచగా 14 రోజుల జుడీషియల్‌ కస్టడీకి ఆదేశించింది. ఆమెను హెచ్‌ఆర్‌బీఆర్‌ లేఔట్‌లోని డీఆర్‌ఐ కేంద్రకార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు. ఆమె బంగారం స్మగ్లింగ్‌ దందాకు కొందరు పోలీసులు, పారిశ్రామికవేత్తలు సహకారం అందించినట్లు అనుమానం వ్యక్తమైంది. 

తరచూ దుబాయ్‌ టూర్లు   
నటి రన్యారావ్‌ తరచూ దుబాయ్‌కి వెళ్లి వస్తోంది. వచ్చేటప్పుడు పెద్ద మొత్తంలో బంగారు నగలను ధరించి అక్రమంగా తీసుకువచ్చేది. కస్టమ్స్‌ , భద్రతా సిబ్బంది తనిఖీలు చేయకుండా డీజీపీ పేరును చెప్పేది. అనధికారికంగా పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనంలో ఇంటికి వెళ్లేది. తరచూ దుబాయ్‌కి వెళ్లి గుట్టుగా బంగారాన్ని తీసుకు వస్తుండడం వెనుక పెద్ద ముఠానే ఉండవచ్చని డీఆర్‌ఐ ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది.  

ఇలా తరలిస్తోంది 
విమానం దిగగానే రన్యను డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా గుట్టు రట్టయింది, 14 బంగారు బిస్కెట్లను తొడ భాగంలో గమ్‌తో అంటించి టేప్‌ చుట్టినట్లు గుర్తించారు. ఆ టేప్‌ పై క్రేప్‌ బ్యాండేజ్‌ను చుట్టుకుందని తెలిపారు. ఇలాగైతే స్కానర్ల తనిఖీలో దొరకనని అనుకుంది. శ్యాండల్‌వుడ్‌లో స్టార్‌గా ఎదగాలంటే ఆర్‌ అనే అక్షరంతో పేరు ఉండాలనుకుని ఆమె రన్య రావుగా పేరు మార్చుకుంది. ఆమె అసలు పేరు హర్షవర్ధిని యఘ్నేశ్, మాణిక్య సినిమా టైంలో రన్య అయ్యింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఆర్‌ అక్షరం పేరుతో స్టార్లు అయ్యారని, తనకూ ఆర్‌ కలిసొస్తుందని భావించింది.

ఒక్కొక్కరు ఎంత బంగారం తేవచ్చు..

⇒ దుబాయి నుంచి భారత్‌ కు వచ్చే పురుష ప్రయాణికులు కస్టమ్స్‌ ఫీజు లేకుండా 20 గ్రాముల బంగారం, మహిళలైతే 40 గ్రాములు బంగారం తీసుకురావచ్చు. 
⇒ ఒకవేళ పురుషులు 50 గ్రాములు తెస్తే 3 శాతం కస్టమ్స్‌ ఫీజును చెల్లించాలి. 50 గ్రాముల కంటే ఎక్కువైతే 6 శాతం, 100 గ్రాములకు మించితే 10 శాతం కస్టమ్స్‌ ఫీజును చెల్లించాలి. 
⇒మహిళా ప్రయాణికులు 100 గ్రాములు బంగారానికి 3 శాతం, 100 గ్రాములు మించితే 6 శాతం కస్టమ్స్‌ రుసుమును చెల్లించాలి. 200 గ్రాముల కంటే ఎక్కువైతే 10 శాతం కస్టమ్స్‌ ఫీజు వేస్తారు. బంగారం కొనుగోలు చేసిన రసీదులను తప్పక చూపించాలి. 

హీరోయిన్‌ అరెస్ట్‌.. నాలుగునెలలుగా ఇంటికి రాలేదన్న తండ్రి డీజీపీ

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)