Breaking News

ప్రముఖ నటి ఆశికా రంగనాథ్‌ ఇంట్లో యువతి ఆత్మహత్య

Published on Mon, 12/01/2025 - 08:31

యశవంతపుర: యువతి  బంధువుల ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. పాండురంగ నగరలోని బంధువుల ఇంటిలో హాసన్‌కు  చెందిన అచల (22) ప్రాణాలు తీసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రముఖ నటి ఆశికా రంగనాథ్‌కు అచల మామ కూతురు అవుతుంది. ఆమె ఇంజనీరింగ్‌ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం కోసం వెతుకుతోంది. తరచూ ఆశికా ఇంటికి వచ్చివెళ్లేది. దూరపు బంధువు మయాంక్‌ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. అతడు ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకొంటానంటూ అచలను లైంగికంగా వేధించేవాడు. అందుకు ఆమె నిరారించటంతో దాడి చేసి కొట్టేవాడని సమాచారం.

 మానసికంగా కుంగిపోయి..  
డ్రగ్స్‌కు బానిసడైన మయాంక్‌ నిరంతం అచలను వేధించేవాడు. దీంతో పాటు మరో యువతితో మయాంక్‌కు సంబంధం ఉన్నట్లు అచలకు తెలిసింది. ఈ పరిణామాలతో  మయాంక్‌ తన జీవితాన్ని నాశనం చేసినట్లు కుంగిపోయింది. అచల 10 రోజుల క్రితం ఆశికా రంగనాథ్‌ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. తమ పరువు పోతుందని భావించి తల్లిదండ్రులు, బంధువులు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు జరిపించారు. అయితే ఆదివారం ఒక్కసారిగా సంగతి బయటపడింది. మయాంక్, అతని తల్లి మైనా పై బెంగళూరు పట్టేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. మయాంక్‌ను అరెస్ట్‌ చేయాలని అచల కుటుంబం డిమాండ్‌ చేస్తోంది. 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)