Breaking News

16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?

Published on Wed, 05/29/2024 - 12:58

ఎండ వేడిమికి దేశంలోని పలు ప్రాంతాల్లోని జనం ఉక్కపోతతో చెమటలు చిందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీలు, కూలర్లు జనానికి ఉపశమనం కల్పిస్తున్నాయి. అయితే బయటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు లేదా దానికిమించినప్పుడు ఏసీలు, కూలర్లు అందించే చల్లదనం ఎవరికీ ఏమాత్రం సరిపోవడం లేదు.

ఎయిర్ కండీషనర్‌లో 16 డిగ్రీల కంటే తక్కువ, 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను సెట్‌ చేయలేం. ఏసీలోని కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా, ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే దీనికి కారణం ఏంటి?

ఏసీ రిమోట్‌లో ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండదనే సంగతి మనకు తెలిసిందే. ఏ బ్రాండ్ ఏసీలోనైనా కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువకు ఉండదు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఏసీ మరమ్మతుకు గురికావడం. రెండోది వినియోగదారుల ఆరోగ్యానికి హానికరంగా పరిణమించడం.

అన్ని ఎయిర్ కండీషనర్లలో  ఇవాపొరేటర్ ఉంటుంది.  ఇది శీతలకరణి సహాయంతో గదిని చల్లబరుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏసీ ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ ఇవాపొరేటర్‌లో మంచు పేరుకుపోతుంది. దీంతో అది త్వరగా మరమ్మతుకు గురవుతుంది. అలాగే వినియోగదారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఏ ఏసీలోనైనా ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువ  ఉండదు.

ఇక ఏసీలోని గరిష్ట ఉష్ణోగ్రత విషయానికొస్తే అది 30 డిగ్రీలకు మించి ఉండదు. సాధారణంగా ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నప్పుడు మనకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించదు. అయితే ఉష్ణోగ్రత అంతకు మించినప్పుడు ఉక్కపోతకు గురవుతాం. అలాగే ఏసీ ఉష్ణోగ్రతను 30 కంటే ఎక్కువగా ఉంచడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే 30 డిగ్రీలకు మించి ఏసీ ఉంటే దాని నుంచి వేడి గాలి వీస్తుంది. నిజానికి ఎయిర్ కండీషనర్ పని గాలిని చల్లబరచడం. వేడి చేయడం కాదు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)