Breaking News

హరియాణాలో ఆప్‌ బలపరీక్ష!

Published on Tue, 08/27/2024 - 06:05

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రస్తుత హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిధ్దమైంది. తాము అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న హరియాణాలో వీలైనన్ని ఎక్కువ సీట్లలో గెలవడం ద్వారా తన బలాన్ని పెంచుకునే ఎత్తులు వేస్తోంది. రాష్ట్రంలోని 90 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిధ్దమైన ఆప్‌ ఢిల్లీ, పంజాబ్‌ల సరిహద్దుల వెంట ఉన్న 27 నియోజకవర్గాలపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టింది.  

పొత్తులకు దూరంగా.. ఒంటరి పోరాటం 
2019 ఎన్నికల్లోనూ హరియణా అసెంబ్లీలో 46 స్థానాల్లో పోటీ పడిన ఆప్‌ కేవలం 0.48 శాతం ఓట్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. ఆ పారీ్టకి చెందిన 35 మందికి పైగా అభ్యర్థులకు వెయ్యి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల అనంతరం మొదలైన రైతు ఉద్యమాల సమయంలో ఆప్‌ ఆ రాష్ట్రంలో పుంజుకునే ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచి్చన హరియాణా రైతులకు అటు పంజాబ్‌లోని, ఇటు ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం సహకరించింది. ఆప్‌కు పెరిగిన బలాన్ని దృష్టిలో పెట్టుకునే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆప్‌తో పొత్తులు పెట్టుకుంది. 

హరియాణాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు గానూ ఆప్‌ కురుక్షేత్ర నుంచి ఒక్క స్థానంలోనే పోటీ చేసింది. ఆప్‌ పార్టీ అభ్యర్థి సుశీల్‌ గుప్తా 29,021 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీకి చెందిన నవీన్‌ జిందాల్‌ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఒంటరిగానే బరిలోకి దిగుతున్న ఆప్, రాష్ట్రంలోని పెహోవా, షహబాద్, కలయత్, గుహ్లా, అంబాలా, తోహానా, రతియా, నర్వానా, రానియా, కలన్‌వాలి, దబ్వాలీ, సోహ్నా, బల్లాబ్‌ఘర్, బహదూర్‌ఘర్‌తో వంటి సరిహద్దు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆప్‌ వర్గాలు చెబుతున్నాయి.

 పార్టీ ఇక్కడ ఇప్పటికే ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తోంది. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ భార్య గురుప్రీత్‌ కౌర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీత ఇప్పటికే రాష్ట్రంలో ప్రచారం మొదలు పెట్టారు. తమ పార్టీ ప్రధాన హామీలైన ఉచిత విద్యుత్, యువతకు ఉపాధి, ప్రతి విద్యారి్థకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ. వెయ్యి సాయం అంశాలను వారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సెప్టెంబర్‌ మొదటివారంలో అభ్యర్థుల ప్రకటన పూర్తయిన వెంటనే ఆప్‌ తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది. హరియాణాలో అక్టోబర్‌ ఒకటిన ఎన్నికలు జరుగనున్నాయి.
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)