Breaking News

యోగి సర్కారుకు ఎనిమిదేళ్లు.. యూపీలో సంబరాలు

Published on Mon, 03/24/2025 - 11:25

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌(CM Yogi Adityanath) సర్కారు ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తోంది. ప్రతి జిల్లాలోనూ బీజేపీ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తలు ‘ఉత్తరప్రదేశ్ శ్రేయస్సు - ఎనిమిది వసంతాల బీజేపీ ప్రభుత్వం’ అనే నినాదంతో గ్రామాలలో సందడి చేస్తున్నారు.

ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం(State Government) మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు నిర్వహించనుంది. రాష్ట్రంలోని బూత్‌ల నుండి జిల్లా ప్రధాన కార్యాలయాల వరకు అన్నిచోట్లా ఉత్సవాలు జరగనున్నాయి. మార్చి 24 నుండి జిల్లా స్థాయిలో వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పథకాలను, ఇందుకోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇంటింటికి చేరవేయనున్నారు. అసెంబ్లీ స్థాయిలో అభివృద్ధి సదస్సులు కూడా నిర్వహించనున్నారు.

జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న ప్రధాన ప్రాజెక్టుల గురించి అందరికీ వివరించేందుకు యువమోర్చా బైక్ ర్యాలీ(Bike rally)లు నిర్వహించనుంది. గత  ఎనిమిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను జిల్లా స్థాయిలో  సమావేశాలు నిర్వహించి, అందరికీ  తెలియజేయనున్నారు. ఏప్రిల్ 14న బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబా సాహెబ్ విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాలలు వేయనున్నారు.

ఇది కూడా చదవండి: ‘రెండు కిలోల వెల్లుల్లి, రూ. 500 తెస్తేనే కేసు దర్యాప్తు’
 

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)