Breaking News

యూపీలో చిన్నారిపై సామూహిక అత్యాచారం.. పోలీసుల ఫైరింగ్‌లో..

Published on Sat, 01/03/2026 - 16:01

లక్నో: మైనర్లపై లైంగిక దాడుల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. మానవ మృగాలు మారడం లేదు. అభం శుభం తెలియని పసిపిల్లలను  తమ కామవాంఛకు బలిచేస్తున్నారు. ఇటువంటి మృగాలను ఏలా శిక్షించాలి వారిని ఏవిధంగా మార్చాలి అన్నది ప్రస్తుతం ప్రభుత్వాలకు సైతం పెద్ద సవాలుగానే మారింది. ఇక, తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని ఆరేళ్ల పసికందుని మానవమృగాలు వేటాడాయి. చిన్నారిపై ఇద్దరు కిరాతకులు అత్యాచారం చేశారు. ఆపై ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి మేడపై నుంచి కిందకి విసిరారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారి ఆస్పత్రికి వెళ్లే లోపే కన్నుమూసింది.

ఈ ఘటనపై పోలీసుల వివరాల ప్రకారం.. బులందషహర్‌లో ఒక ఇంటి మేడపై రాజు, వీరు కశ్యప్ అనే ఇద్దరు యువకులు అద్దెకుంటారు. అయితే అదే మేడపై ఓ ఆరేళ్ల చిన్నారి ఆడుకోవడానికి వెళ్లింది. అప్పుడే అక్కడే  ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు పసికందుకై కిరాతకంగా అత్యాచారం చేశారు. అనంతరం అనుమానం రాకుండా ఉండడానికి మేడపై నుంచి తోసేసారు. దీంతో ఆ చిన్నారి  భవనం వెనక అపస్మారక స్థితిలో పడి ఉంది. ఎంతసేపైనా తమ పాప రాకపోవడంతో తన కోసం వెతికిన తల్లిదండ్రులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న  పాపను చూసి దిగ్బ్రాంతికి గుర‍య్యారు. తనను వెంటనే  ఆసుపత్రికి తీసుకెళ్లగా  పాపను పరీక్షించిన వైద్యులు  తను అప్పటికే మృతిచెందిందని తెలిపారు.

దీంతో పైనున్న ఇద్దరు యువకులపై అనుమానం వచ్చి పాప తల్లిదండ్రులు పోలీసులకు సమచారమిచ్చారు. అయితే నిందితులు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారు. దీంతో వారి కోసం పోలీసులు ఆపరేషన్ ప్రారంభించి వారున్న ప్రాంతానికి వెళ్లారు. ఈ  క్రమంలో పోలీసులపై ఆ దుండగులు కాల్పులు జరపగా, పోలీసులూ ఎదురుకాల్పులు జరిపి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని  ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రాథమిక విచారణలో వారిద్దరూ నేరం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత  లోతుగా విచారణ జరుగుతున్నామని  పేర్కొన్నారు.  

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు