Breaking News

కేక్‌ తిని ఐదేళ్లు బాలుడు మృతి.. ఐసీయూలో తల్లిదండ్రులు

Published on Tue, 10/08/2024 - 12:10

బనశంకరి: బెంగళూరులో కేక్‌ తిని ఐదేళ్లు బాలుడు మృతిచెందగా అతని తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కేపీ అగ్రహార పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

కొంతసేపటికే విషమం
వివరాలు... భువనేశ్వరినగరలో బాలరాజ్‌, నాగలక్ష్మీ దంపతులు ఐదేళ్ల కొడుకు ధీరజ్‌తో కలిసి ఉంటున్నారు. బాలరాజ్‌ స్విగ్గీ డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఓ కేక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. భార్య, కొడుకుతో కలిసి తిన్నారు. కొంతసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇరుగు పొరుగు చూసి ముగ్గురిని సమీప కిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందించారు. కానీ బాలుడు ధీరజ్‌ చనిపోగా, బాలరాజ్‌, నాగలక్ష్మీలకు విషమంగా ఉంది.

పోలీసుల విచారణ
కేపీ అగ్రహార పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సమాచారం సేకరించారు. ఆ కేక్‌ను ఏ బేకరి నుంచి తీసుకువచ్చారు, అందులో ఏమైనా కలిపారా? అనేది ఆరా తీశారు. కేక్‌ కలుషితం కావడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నివేదిక కోసం పోలీసులు వేచిచూస్తున్నారు.

అనేక సందేహాలు
ఓ వ్యక్తి స్విగ్గీలో కేక్‌ ఆర్డర్‌ చేసి తరువాత క్యాన్సిల్‌ చేయడంతో బాలరాజ్‌ ఆ కేక్‌ను ఇంటికి తీసుకువచ్చినట్లు తేలింది. ఈ కేసు అనేక అనుమానాలకు తావిస్తోంది. కేక్‌ కలుషితం కావడం వల్ల జరిగిందా? లేక ఎవరైనా కావాలనే విషం కలిపారా? లేదా బాలరాజే కేక్‌లో ఏదైనా కలిపి కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు నెలకొన్నాయి. కేక్‌ నమూనాలను పోలీసులు పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. బాలుని పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. విష పదార్థం కలిసి ఉండే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)