Breaking News

మణిపూర్‌లో మళ్లీ హింస.. ఆరుగురి మృతి

Published on Sat, 09/07/2024 - 14:38

మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్‌లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ దాడులు మొదలయ్యాయి. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన తాజా హింసలో ఆరుగురు ప్రజలు మరణించారని పోలీసులు తెలిపారు.

మైయితీ, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిరిబామ్‌ జిల్లా కేంద్రానికి 5 కి.మీ.ల దూరంలో ఉన్న ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తి ఇంట్లోకి మిలిటెంట్లు ప్రవేశించి నిద్రలోనే కాల్చి చంపారని తెలిపారు. 

ఈ హత్యానంతరం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల్లో ఇరు వర్గాలకు చెందిన సాయుధుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో నలుగురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మ‌రోవైపు చూరాచాంద్‌పుర్‌లో మిలిటెంట్ల‌కు చెందిన మూడు బంక‌ర్ల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడుల‌ను ఇక్క‌డ్నుంచే చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

కాగా మణిపూర్‌లో గత ఏడాదిన్నర కాలంగా హింస కొనసాగుతూనే ఉంది. గతేడాది మే నుంచి కుకీలు, మైతేయ్‌ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 225 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పర్వత - మైదాన ప్రాంత ప్రజలుగా విడిపోయారు.

ముఖ్యంగా గడచిన ఐదురోజుల్లో హింస మరింత పెరిగింది. శుక్రవారం మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో రెండు ప్రదేశాల్లో డ్రోన్‌ దాడులు జరిగాయి. అయితే కుకీ మిలిటెంట్లే వీటిని వాడుతున్నారని మైయితీ వర్గం ఆరోపిస్తోంది. కుకీలు మాత్రం ఖండిస్తున్నారు.

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)