Breaking News

70 ఏళ్ల నా భర్త నాతో కాపురం చేయడం లేదు..!

Published on Thu, 06/11/2026 - 13:21

తమిళనాడు: కోర్టు ఆదేశాల మేరకు భార్యకు జీవనాంశం ఇవ్వని 70 ఏళ్ల వృద్ధుడికి  17 నెలల జైలుశిక్ష విధిస్తూ పళ్ళిపట్టు న్యాయస్థానం ఆదేశించింది. ఆంధ్రాలోని తిరుపతి జిల్లా  నారాయణవనంకు చెందిన అన్నాదురై(70)కు  మొదటి భార్య మృతితో  పళ్ళిపట్టు సమీపంలోని సొరకాయపేటకు చెందిన నిర్మల(45) అనే ప్రత్యేక ప్రతిభావంతురాలిని వివాహం చేసుకున్నారు. దంపతులకు  ఇద్దరు అమ్మాయిలు వున్నారు. 

గత కొన్నేళ్ల కిందట భార్యను  ఆన్నాదురై విడిచిపెట్టడంతో   సొరకాయపేటలోని పుట్టింట్లో ఇద్దరు ఆడ బిడ్డలతో  నిర్మల  వుంటున్నారు.తన భర్త  తనతో కాపురం చేయకుండా విడిచిపెట్టినట్లు దీంతో తనకు బిడ్డలకు జీవనం కష్టంగా మారిందని  బాధితురాలు 2022లో  పళ్లిపట్టు మున్సిల్‌  జ్యుడిషియల్‌ కోర్టులో  కేసు దాఖలు చేసారు. నిర్మల తరపున న్యాయవాధి  భరత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. భార్య బిడ్డలను   విడిచిపెట్టిన అన్నాదురై  వారి జీవనాంశంగా ప్రతినెలా  రూ. 20 వేలు చెల్లించాలని 2022లో  న్యాయస్థానం ఆదేశించింది. అయితే  అన్నాదురై   నిర్మలకు  జీవనాంశం చెల్లించపోవడంతో  2024లో మళ్లీ కోర్టు మెట్లెక్కారు.  

ఈ కేసుకు సంబందించి  అన్నాదురైకు  న్యాయస్థానం  అరెస్టు వారెంట్‌ జారీచేసింది. దీంతో పొదటూరుపేట పోలీసులు అన్నాదురైను మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసుకు సంబందించి న్యాయస్థానం ఆదేశాలు ఎందుకు పాటించలేదని,  జీవనాంశం ఎందుకు  చెల్లించలేదని న్యాయమూర్తి వెంకటేశన్‌  ప్రతివాదిని  ప్రశ్నించగా   సమాదానం లేక పోవడంతో  అన్నాదురైకు 17 నెలల జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో  పోలీసులు అన్నాదురైను అరెస్టు చేసి పుళళ్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)