Breaking News

chhattisgarh: 72 రైళ్లు రద్దు.. రూ. 29 కోట్లు నష్టం

Published on Sat, 08/03/2024 - 12:05

జార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాదం తర్వాత ఈ మార్గంలోని అరడజనుకు పైగా రైళ్లు రద్దు కావడంతో ఒకవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు రైల్వేశాఖ ఆదాయానికి గండిపడింది.

తాజాగా రాజ్‌నంద్‌గావ్-కల్మనా రైల్వే సెక్షన్ మధ్య మూడవ రైల్వే లైన్‌ను కలమన రైల్వే స్టేషన్‌కు అనుసంధానించేందుకు రైల్వేశాఖ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, ప్రీ నాన్-ఇంటర్‌లాకింగ్ పనులను చేపట్టింది. దీంతో ఎక్స్‌ప్రెస్, మెమూ రైళ్లు ఆగస్టు 4 నుండి 20 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో రక్షాబంధన్ సందర్భంగా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికులకు ఇబ్బందులు  ఎదురుకానున్నాయి.

బిలాస్‌పూర్- నాగ్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రద్దు ప్రభావం అటు ప్రయాణికులపైన, ఇటు రైల్వే ఆదాయంపైన పడనుంది.అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో గత మూడు నెలలుగా రాయ్‌పూర్ మీదుగా వెళ్లే రైళ్లను తరచూ రద్దు చేస్తున్నారు. ఈసారి ఏకంగా 72 రైళ్లను (416 ట్రిప్పులు) రద్దు చేయడంతో ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో కన్ఫర్మ్ చేసిన 4 లక్షల 32 వేల టిక్కెట్లను  రద్దు చేయడంతో, రైల్వేశాఖ ప్రయాణికులకు రూ.28 కోట్ల 86 లక్షలు వాపసు చేయాల్సి ఉంటుంది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)