Breaking News

ఐదేళ్లలో 370 మిలియన్‌ డాలర్ల కేశాల ఎగుమతి

Published on Sat, 08/12/2023 - 03:37

సాక్షి, న్యూఢిల్లీ: దేశం నుంచి ఐదేళ్లలో 370.11 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన మానవ కేశాలు ఎగుమతి అయ్యాయని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్‌ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2018–19లో 34.46 మిలియన్‌ డాలర్లు, 2019–20లో 5.70 మిలియన్‌ డాలర్లు, 2020–21లో 11.65 మిలియన్‌ డాలర్లు, 2021–22లో 149.07 మిలియన్‌ డాలర్లు, 2022–23లో అత్యధికంగా 169.23 మిలియన్‌ డాలర్ల విలువైన కేశాలు ఎగుమతి చేసినట్లు వివరించారు.

మానవ కేశాలు, ఉత్పత్తుల అసోసియేషన్, ప్లెక్స్‌ కౌన్సిల్‌ సమాచారం మేరకు ప్రపంచంలోనే అత్యధికంగా మానవ కేశాలు లభించేది భారతదేశంలోనే అని తెలిపారు. దేశంలో లభించే కేశాలు నాణ్యమైనవిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినట్లు చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్‌ మీదుగా మయన్మార్‌ నుంచి చైనాకు భారతీయ మానవ కేశాల అక్రమ రవాణాకు సంబంధించి ఆధారాలు లేవని, కస్టమ్స్‌ వద్ద కేసులేమీ నమోదు కాలేదని తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)