Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో 33 మంది  మావోలు లొంగుబాటు 

Published on Sat, 04/19/2025 - 05:58

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 33 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. వీరిలో 17 మందిపై మొత్తం రూ.49 లక్షల రివార్డు ఉందని ఎస్‌పీ కిరణ్‌ చవాన్‌ చెప్పారు. వీరిలో 9 మంది మహిళలు సహా 22 మంది సీఆర్‌పీఎఫ్‌ ఎదుట, మరో ఇద్దరు మహిళలు సహా 11 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారని వివరించారు. 

సైద్ధాంతిక బలం లేని మావోయిస్ట్‌ పార్టీ స్థానిక గిరిజనులపై అమానవీయ చర్యలకు పాల్పడుతున్నందునే తీవ్రవాదాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు వీరు చెప్పారన్నారు. లొంగిపోయిన వారిలో సుమారు 22 మంది ఛత్తీస్‌గఢ్‌లోని మా, ఒడిశాలోని నౌపడలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కిరణ్‌ చవాన్‌ వివరించారు. లొంగుబాట పట్టిన వారిలో ప్రముఖంగా పీఎల్‌జీఏ డిప్యూటీ కమాండర్‌ ముచాకి జోగా(33), అతడి భార్య, అదే స్క్వాడ్‌కు చెందిన జోగి(28) ఉన్నారని వీరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉందని ఎస్‌పీ చెప్పారు. ఇంకా కమిటీ సభ్యులైన కికిడ్‌ దెవె(30), మనోజ్‌లపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందన్నారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)