Breaking News

విమాన ప్రయాణీకులకు శుభవార్త

Published on Mon, 05/12/2025 - 12:17

ఢిల్లీ: దేశంలోని 32 విమానాశ్రయాల మూసివేత అంశంపై భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) కీలక ప్రకటన చేసింది. కొన్ని రోజులుగా మూసివేసిన 32 విమానాశ్రయాలను నేడు తిరిగి తెరిచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు విమానయాన కార్యకలాపాలను పునరుద్ధరిస్తూ సంబంధిత అధికారులు నోటీస్ టు ఎయిర్‌మెన్ (NOTAM) జారీ చేశారు.

భారత్, పాక్‌ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 32 విమానాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనడంతో కొన్ని రోజుల పాటు నిలిచిపోయిన విమాన సేవలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. విమానాశ్రయాల్లో విమాన సేవలు అందుబాటులోకి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ 32 విమానాశ్రయాల నుంచి పౌర విమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

ఇక, విమానాశ్రయాల పునఃప్రారంభంతో ప్రయాణికులు, విమానయాన సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. నిలిచిపోయిన సర్వీసులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతుండటంతో ప్రయాణాలకు ఊరట లభించింది. నోటామ్ జారీ చేయడం ద్వారా విమానాల రాకపోకలకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని పైలట్లకు, ఇతర సిబ్బందికి అధికారికంగా తెలియజేశారు. దీంతో విమానయాన కార్యకలాపాలు సురక్షితంగా, సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)