Breaking News

దంతెవాడలో బలగాల ఆపరేషన్‌ సక్సెస్‌.. మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!

Published on Sat, 10/05/2024 - 16:02

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 31 మంది నక్సలైట్లు మృతిచెందారు. దాదాపు 48 గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేశ్‌ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం.

వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున కూంబింగ్‌ కొనసాగుతోంది. దాదాపు 1,500 మంది భద్రత సిబ్బందితో 48 గంటలపాటు ఆపరేషన్‌ సాగినట్లు అధికారుల వెల్లడించారు. పొలాలు, చిత్తడి దారుల గుండా 10 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడినుంచి 12 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి ఎన్‌కౌంటర్‌ ప్రాంతానికి బలగాలలు చేరుకున్నాయి.

ఇక, ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిలో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్ అలియాస్ ఆర్కె, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం. ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు కాగా, కమలేశ్‌ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.

మరోవైపు.. ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి  విష్ణుదేవ్‌ సాయి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం అంతమై శాంతి నెలకొంటుంది. మన బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయి. 31 మంది నక్సల్స్‌ను హతమార్చారు. మన సైనికులు గత రికార్డును బద్దలు కొట్టారు. ఎన్‌కౌంటర్‌ విషయంలో మా సైనికులను అభినందిస్తున్నాము. వారి ధైర్యానికి వందనం. ఈ ఘటన మావోయిస్టులు అణిచివేతకు మార్గం చూపించింది అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. మృతుల ఫొటోలు, వివరాలను పోలీసులు వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే, ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారించాలని డిమాండ్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: బెంగాల్‌లో మరో దారుణం
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)