Breaking News

ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్‌ జామ్‌.. 300 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Published on Mon, 02/10/2025 - 11:24

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద అథ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటైన మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) వెళుతున్నారా? అయితే జాగ్రత్త. కుంభమేళా ముగింపు తేదీ గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఫలితంగా కుంభమేళా జరిగే ప్రయాగ్‌ రాజ్‌ వెళ్లే మార్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫ్రిక్‌ జామ్‌ (world's biggest traffic jam) ఏర్పడింది. సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.   

శనివారం నుంచి లక్షల వాహనాలు ప్రయాగరాజ్‌ వైపు మళ్లాయి. దీంతో భక్తులు త్రివేణి సంగమ్ (గంగ, యమునా, సరస్వతి నదుల సంగమం) వద్ద పవిత్ర స్నానమాచరించేందుకు సమయానికి చేరుకోలేకపోతున్నారు. రోజుల సమయం పట్టనున్నడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ప్రయాగరాజ్ సంగమ్ రైల్వే స్టేషన్‌ను అధికారులు శుక్రవారం వరకు మూసివేశారు.

 ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగీ ఆధిత్యనాథ్‌ సర్కార్‌పై  సమాజవాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలి,దాహంతో ఇబ్బంది పడుతున్న భక్తులను మనవత్వంతో చూడాలి. సామాన్య భక్తులు మనుషులే కదా? వారికి కనీస సదుపాయాలు కల్పించారా? అని ప్రశ్నలు సంధించారు. 

అంతకుముందు కుంభమేళా ఏర్పాట్లపై అఖిలేష్‌  యాదవ్‌ ట్వీట్‌ చేశారు.  ప్రయాగరాజ్‌లో ట్రాఫిక్ పరిస్థితి గురించి హైలైట్ చేస్తూ.. భక్తుల కోసం అత్యవసర ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రయాగరాజ్ ప్రవేశం సమీపంలో నవాబగంజ్‌లో 30 కిలోమీటర్లు, గౌహానియాలో 16 కిలోమీటర్లు,వారణాసి మార్గంలో 12 నుండి 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉంది. ట్రాఫిక్‌ జామ్‌ వల్ల జనజీవనం స్తంభించింది.

అందుకే ఉత్తర ప్రదేశ్‌లో వాహనాలకు టోల్ ఛార్జీల నుంచి విముక్తి కల్పించాలి. తద్వారా  ప్రయాణ సమస్యలు, ట్రాఫిక్ జామ్‌ను తగ్గించవచ్చు. సినిమాల్లా వినోదానికి కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌ను వసూలు చేయనప్పుడు, వాహనాలకు టోల్ ఫ్రీ ఎందుకు చేయలేరు? అని పునరుద్ఘాటించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)