Breaking News

టికెట్టు తీసుకునే అలావాటు లేదు..!

Published on Sun, 12/21/2025 - 12:24

సాక్షి, చెన్నై: టికెట్టు కొనకుండా ఏకంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి 300 మంది ప్రయాణికులు రామేశ్వరానికి వచ్చారు. వారిని ఓ రైల్వే టీటీ పట్టుకోగా జైహో... జైహో అన్న నినాదాలతో బయటకు పరుగులు తీశారు. వివరాలు.. రామనాథపురం జిల్లా రామేశ్వరం నుంచి ఉత్తరాది రాష్ట్రాల నుంచి నిత్యం రైళ్లు వచ్చి వెళ్తుంటాయి. శనివారం ఉదయం ఉత్తరాది నుంచి వచ్చిన  రైళ్లలో దిగిన ప్రయాణికులపై అనుమానాలు నెలకొన్నాయి. 

ఒక రైలులో పెద్దసంఖ్యలో దిగి వచ్చిన వారంతా  నెత్తిన బ్యాగులు, సంచులను పెట్టుకుని దిగి ప్లాట్‌ ఫాం మీదకు చేరారు. వీరి వద్ద టికెట్టు కలెక్టర్‌ తనిఖీ చేయగా, తామెవ్వరూ టికెట్లు కొనుగోలు చేయలేదంటూ సమాధానం ఇవ్వడంతో షాక్‌కు గురయ్యాడు.  వారందరికీ జరిమానా విధించేందుకు టీటీ సిద్ధమయ్యాడు. అలాగే ఇతర సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే వారు వచ్చేలోపు ఈ 300 మంది టీటీపై తిరగ బడ్డారు. తమకు టికెట్టు తీసుకునే అలావాటు లేదంటూ గథమాయించడం మొదలెట్టారు. అంతే కాదు జైహో...జైహో... అని నినదిస్తూ అందరూ రైల్వే స్టేషన్‌ బయటకు పరుగులు తీయడంతో టీటీ విస్తుపోయాడు. 

తాజాగా వీరంతా బయటకు తప్పించుకు వెళ్లినా, తిరుగు ప్రయాణంలో పట్టుకునేందుకు ముందు జాగ్రత్తలలో రామేశ్వరం  రైల్వే వర్గాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కాగా ఉత్తరప్రదేశ్‌  నుంచి ఇంత పెద్ద సంఖ్యలో టికెట్టు తీసుకోకుండా ప్రయాణికులు తరలి వస్తుంటే, మార్గం మధ్యలోని ఇతర స్టేషన్లు, ప్రధాన జంక్షన్‌లలో టీటీలు ఎవ్వరూ సోదాలు చేయక పోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా వారంతా రోజువారీ కూలీలు, పేదలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)