Breaking News

మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు

Published on Tue, 10/22/2024 - 12:16

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు విమానయాన సంస్థల విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి కూడా 30 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి ఇండియన్ ఎయిర్‌లైన్‌కు చెందిన 30 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

ఇండిగో ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన నాలుగు విమానాలకు సోమవారం భద్రతా హెచ్చరికలు అందాయని తెలిపారు. ఈ జాబితాలో 6ఈ 164 (మంగుళూరు నుండి ముంబై), 6ఈ 75 (అహ్మదాబాద్ నుండి జెడ్డా), 6ఈ 67 (హైదరాబాద్ నుండి జెడ్డా),  6ఈ 118 (లక్నో నుండి పూణే) ఉన్నాయి.  వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా  అక్కడి నుండి తరలించారు.

ఇదేవిధంగా ఎయిర్ ఇండియా విమానాలకు కూడా బెదిరింపులు వచ్చినట్లు  ఆ సంస్థ ప్రతినిధి  ధృవీకరించారు. నిర్దేశించిన ప్రోటోకాల్‌ను అనుసరించి, సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారని, భద్రతా సంస్థల మార్గదర్శకాల ప్రకారం అన్ని భద్రతా విధానాలను  అమలు చేశామన్నారు.

విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలకు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తమయ్యారని, అన్ని భద్రతా విధానాలను అమలు చేశారన్నారు.

గడచిన వారం రోజుల్లో 120కి పైగా భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బాంబు బెదిరింపులను కేవలం వదంతులుగా తేలికగా తీసుకోలేమని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు.  కాగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. నేరస్తులను నో-ఫ్లై జాబితాలో ఉంచే యోచనలో ఉందని సమాచారం. 

ఇది కూడా చదవండి: ఉద్యోగుల తొలగింపు అవాస్తవం: ఫోన్‌పే

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)