Breaking News

అమ్మో.. ఇవేం ఎండలు

Published on Sat, 12/28/2024 - 09:58

బనశంకరి: రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా 2024 ఎండాకాలంలో వేడిమి నమోదైంది. ఏప్రిల్‌, మే మాసాల్లో రాష్ట్రంలో సరాసరి ఉష్ణోగ్రత కంటే 3–4 సెల్సియస్‌ డిగ్రీలు పెరిగి ప్రజలు అల్లాడిపోయారు. గత ఐదేళ్లలో ఉష్ణోగ్రతలను గమనిస్తే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే మాసాలలో, అలాగే అక్టోబరులో ఎండలు ఎక్కువని తేలింది. కళ్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక ప్రాంతాల్లో కనబడుతున్న అధిక ఎండలతో అక్కడి ప్రజలు హైరానా పడుతున్నారు. బెళగావి, బాగల్‌కోటే, ధారవాడ, హావేరి, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో సరాసరి ఉష్ణోగ్రత 3– 4 డిగ్రీలు సెల్సియస్‌ పెరిగింది. దీంతో రాబోయే వేసవిని తలచుకుని భయపడాల్సి వస్తోంది.

ఈ జిల్లాల్లో హడల్‌
బాగల్‌కోటే, బెళగావి, బీదర్‌, ధారవాడ, గదగ, కొప్పళ, హావేరి, హాసన్‌, కలబుర్గి, ఉత్తర కన్నడ, కొడగు, మంగళూరు, రాయచూరు, విజయపుర జిల్లాల్లో గత అక్టోబరులో 30 డిగ్రీలు సెల్సియస్‌ కంటే ఎక్కువ తాపమానం ఏర్పడింది. బెంగళూరులో 29 డిగ్రీలు సెల్సియస్‌ నమోదైంది. వర్షంతో పాటు వేడి కూడా పెరిగింది. అక్టోబరులో ఇంత వేడి రావడం వాతావరణ నిపుణులను కూడా విస్మయపరచింది. ఇక బెంగళూరులో వేసవిలో అనేక ప్రాంతాల్లో చుక్క నీటికి కటకటలాడారు.

అక్టోబరులో ఎందుకలా?
సెప్టెంబరులో వర్షం పడకపోతే నేలలో తేమ తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని బెంగళూరు కేంద్ర వాతావరణశాఖ డైరెక్టర్‌ సీఎస్‌ పాటిల్‌ తెలిపారు. ఎల్‌నినో, లానినో ప్రభావాల వల్ల అధిక ఎండలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నట్లు చెప్పారు. వాతావరణానికి అనుగుణంగా ఈ ఏడాది వానలు కురవలేదని, అనూహ్యంగా అక్టోబరులో ఉష్ణోగ్రతలు పెరిగాయని ధార్వాడ అగ్రి యూనివర్శిటీ వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్‌ రవిపాటిల్‌ తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)