Breaking News

పంజాబ్‌లో విషాదం

Published on Wed, 05/14/2025 - 03:19

చండీగఢ్‌/అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 21 మంది అమాయకులు బలయ్యారు. మజీఠా పట్టణ పరిధిలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మరో 10 మంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం వీళ్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని సోమవారం రాత్రి ఐదు గ్రామాల నుంచి పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కల్తీ మద్యం సరఫరాకు కారకులైన పది మందిని అరెస్ట్‌చేశారు. మద్యం ప్రధాన సరఫరాదారు ప్రభ్‌జీత్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. విచారణ సమయంలో ప్రభ్‌జీత్‌ సింగ్‌ కీలక సరఫరాదారు సాహబ్‌సింగ్‌ పేరును వెల్లడించాడు. మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఎక్సయిజ్, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో రెండు కేసులు నమోదుచేసి దర్యాప్తు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

నకిలీ మద్యం ఏరులై పారుతున్నా నిఘా పెట్టకుండా నిర్లక్ష్యం వహించారంటూ ప్రభుత్వం వెంటనే మజీఠా డెప్యూటీ ఎస్పీ అమోలక్‌ సింగ్, మజీఠా పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ అవతార్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేసింది. బాధిత కుటుంబాలకు తలో రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి మాన్‌ సింగ్‌ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబంలోని చిన్నారులు చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం మాన్‌ అన్నారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలే ఉన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి